Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
- న్యూజిలాండ్‌తో తొలి టీ20లో సంజూ శాంసన్ 33 బంతుల్లో 67 పరుగులు.
- 2026లో శాంసన్‌కు ఇది ఎనిమిదో 50+ స్కోరు.
- ఒక క్యాలెండర్ ఇయర్లో 8 లేదా అంతకంటే ఎక్కువ 50+ స్కోర్లు చేసిన ఐదో భారత బ్యాటర్‌గా ఘనత.
- 2022లో సూర్యకుమార్ యాదవ్ 11 సార్లు 50+ స్కోర్లతో అగ్రస్థానంలో
- విరాట్ కోహ్లీ 2022లో 9 సార్లు 50+ స్కోర్లు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanju Samson: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ మరోసారి తన బ్యాటింగ్ సత్తా చాటాడు. క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ వేదికగా 226 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కేవలం 33 బంతుల్లోనే 67 పరుగులు చేసి భారత విజయానికి బలమైన పునాది వేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో 2026 క్యాలెండర్ ఇయర్లో ఎనిమిదోసారి 50కి పైగా స్కోరు నమోదు చేసి అరుదైన ఘనత సాధించాడు.
భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ అదిరిపోయే ఆరంభం అందించారు. తొలి ఓవర్ నుంచే న్యూజిలాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన శాంసన్ కేవలం 23 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. మొత్తంగా 33 బంతులు ఎదుర్కొన్న అతడు 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 67 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ కూడా 12 బంతుల్లో 29 పరుగులతో మెరుపులు మెరిపించాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు కేవలం 5.5 ఓవర్లలోనే 93 పరుగులు జోడించారు. దీంతో పవర్‌ప్లే ముగిసే సమయానికి భారత్ 94/1తో పటిష్ట స్థితిలో నిలిచింది. ఆ తర్వాత మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో శాంసన్ 67 పరుగుల వద్ద ఔటయ్యాడు.
Also Read
- AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
- Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
- Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!
- Shamonda Virus: ‘‘షమోండా వైరస్’’ కలకలం.. తొలి మానవ మరణం నమోదు..
ఈ అర్ధశతకంతో శాంసన్ మరో అరుదైన జాబితాలో చోటు సంపాదించాడు. ఒక క్యాలెండర్ ఇయర్లో టీ20 అంతర్జాతీయ క్రికెట్లో ఎనిమిది లేదా అంతకంటే ఎక్కువసార్లు 50+ స్కోర్లు నమోదు చేసిన ఐదో భారత బ్యాటర్‌గా నిలిచాడు. భారత్ తరఫున ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక 50+ స్కోర్లు చేసిన రికార్డు సూర్యకుమార్ యాదవ్ పేరిట ఉంది. అతడు 2022లో ఏకంగా 11 సార్లు ఈ ఘనత సాధించాడు. విరాట్ కోహ్లీ అదే ఏడాది 9 సార్లు 50కి పైగా పరుగులు చేశాడు. 2026లో అభిషేక్ శర్మ ఇప్పటికే 9 సార్లు ఈ మార్క్ అందుకోగా.. ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ చెరో 8 సార్లు 50+ స్కోర్లు నమోదు చేశారు. దీంతో విరాట్ కోహ్లీ రికార్డుకు శాంసన్ ఒక్క 50+ స్కోరు దూరంలో నిలిచాడు. న్యూజిలాండ్ సిరీస్‌లోనే మరోసారి అర్ధశతకం సాధిస్తే కోహ్లీ 9 స్కోర్ల రికార్డును సమం చేసే అవకాశం ఉంది.
టీ20 అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున ఓపెనర్‌గా అత్యధిక 50+ స్కోర్లు చేసిన ఆటగాళ్ల జాబితాలోనూ శాంసన్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకున్నాడు. రోహిత్ శర్మ 32 సార్లు 50+ స్కోర్లతో అగ్రస్థానంలో ఉండగా.. కేఎల్ రాహుల్ 21, అభిషేక్ శర్మ 17తో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. శాంసన్ ఖాతాలో ఇప్పుడు 12 సార్లు 50+ స్కోర్లు చేశాడు. సంజూ శాంసన్ టీ20 కెరీర్లో అత్యంత వేగంగా చేసిన అర్ధశతకాల జాబితాలో క్రైస్ట్‌చర్చ్ ఇన్నింగ్స్ కూడా చేరింది. 2026లో అఫ్గానిస్థాన్‌పై ఢిల్లీలో, వెస్టిండీస్‌పై హైదరాబాద్‌లో 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీలు చేశాడు. వెస్టిండీస్‌పై రాంచీలో 21 బంతులు, 2024లో బంగ్లాదేశ్‌పై హైదరాబాద్‌లో 22 బంతుల్లో అర్ధశతకాలు నమోదు చేశాడు. తాజాగా న్యూజిలాండ్‌పై 23 బంతుల్లోనే 50 పరుగుల మార్క్ చేరుకున్నాడు.
తాజావార్తలు
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
Indian Cinema: హీరో వేషాలు బోర్ కొట్టాయా?
-
PDS Rice : ఇబ్రహీం పట్నం లో భారీగా పీడీఎస్ బియ్యం పట్టివేత.. రైస్ మిల్లుపై దాడి
-
Balakrishna: మోక్షజ్ఞ మూవీలో బాలయ్య రోల్ అంతేనా?
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
ట్రెండింగ్
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!
-
Home Remedies : తెల్ల సాక్సులపై నల్ల మరకలా? ఇలా సింపుల్ చిట్కాలతో వదిలించండి
-
Harry Brook: ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీతో హరీ బ్రూక్ విధ్వంసం..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP కెమెరా, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 లాంచ్..!