AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
- ఏపీ ఇంటర్ 2026-27 విద్యా సంవత్సర పరీక్షల షెడ్యూల్ విడుదల.
- ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 15 వరకు.
- సెకండియర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 16 వరకు.
- ఫస్టియర్ తొలి పరీక్ష ఫిబ్రవరి 24న లాంగ్వేజ్ పేపర్-1తో ప్రారంభం.
- సెకండియర్ పరీక్షలు ఫిబ్రవరి 25న లాంగ్వేజ్ పేపర్-2తో ప్రారంభం.
- ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Inter Exams Time Table: ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఫిబ్రవరి/మార్చి – 2027 వార్షిక పరీక్షల టైమ్‌టేబుల్‌ను ప్రకటించింది. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు ఫిబ్రవరి 24, 26 తేదీల్లో.. మార్చి 1, 3, 5, 9, 12, 15 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి. ఫిబ్రవరి 24న మొదటి రోజు లాంగ్వేజ్ పేపర్-1తో పరీక్షలు ప్రారంభమవుతాయి. మార్చి 15న మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ పేపర్-1తో ఫస్టియర్ పరీక్షలు ముగుస్తాయి.
సెకండియర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభమై మార్చి 16 వరకు కొనసాగుతాయి. ఫిబ్రవరి 25న లాంగ్వేజ్ పేపర్-2తో పరీక్షలు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 27, మార్చి 2, 4, 8, 11, 13 తేదీల్లో పరీక్షలు నిర్వహించి.. మార్చి 16న మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ పేపర్-2తో ముగుస్తాయి. ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సుల విద్యార్థులకు కూడా ఇదే పరీక్ష తేదీలు వర్తిస్తాయని బోర్డు వెల్లడించింది. అయితే వొకేషనల్ పరీక్షలకు సంబంధించిన ప్రత్యేక టైమ్‌టేబుల్‌ను తరువాత విడిగా విడుదల చేయనున్నారు.
Also Read
- Akvan Cyclone: అక్వాన్ తుఫాన్ ముప్పు.. హోంమంత్రి అనిత సమీక్ష.. అత్యవసర సహాయం కోసం టోల్‌ఫ్రీ నంబర్లు..
- 38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
- IFFI అవార్డుకు నామినేట్ అయిన తొలి తెలుగు వెబ్ సిరీస్‌గా చరిత్ర సృష్టించిన ‘మయసభ’..!
- 21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..
ప్రాక్టికల్ పరీక్షలు జనరల్ కోర్సులకు ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు, వొకేషనల్ కోర్సులకు ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లలో జరుగుతాయి. ఇందులో ఆదివారాలు కూడా ఉన్నాయి. అలాగే ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష జనవరి 27న, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జనవరి 29న నిర్వహించనున్నారు. ప్రస్తుతం ప్రకటించిన షెడ్యూల్ తాత్కాలికమైనదని. ప్రభుత్వ సెలవుల ఆధారంగా కొన్ని తేదీల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చని బోర్డు స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Chiru Leaks: చిరు లీక్స్.. ‘కాకా’లో అసలు సస్పెన్స్ రివీల్ చేసిన చిరంజీవి!
-
Akvan Cyclone: అక్వాన్ తుఫాన్ ముప్పు.. హోంమంత్రి అనిత సమీక్ష.. అత్యవసర సహాయం కోసం టోల్‌ఫ్రీ నంబర్లు..
-
Kulgam Encounter: అల్లాహ్‌ను కలవాలని ఉంది.. నేను చాలా సంతోషంగా ఉన్నా.. ఎన్‌కౌంటర్‌కు ముందు లతీఫ్ భట్ చివరి మాటలు!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
IFFI అవార్డుకు నామినేట్ అయిన తొలి తెలుగు వెబ్ సిరీస్‌గా చరిత్ర సృష్టించిన ‘మయసభ’..!
ట్రెండింగ్
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..
-
SRH-IPL 2027: హెడ్‌కు గుడ్‌బై.. మరో 8 మంది అవుట్.. ఎస్ఆర్హెచ్ రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
MS Dhoni Drone Show: రెండు కళ్లు చాలవుగా చూడడానికి.. ధోనీ రెటైమెంట్తో ప్రత్యేక డ్రోన్ షో నిర్వహించిన సీఎస్కే..!
-
IPL 2027 Retentions: ధోనీ ఔట్.. ట్రావిస్ హెడ్, స్టార్క్‌కు షాక్.. 10 జట్ల రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
200MP కెమెరా, AMOLED సెకండరీ డిస్ప్లే, 6,000mAh బ్యాటరీతో Xiaomi 18 Pro లాంచ్..!