Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
- న్యూజిలాండ్‌తో తొలి టీ20లో అభిషేక్ శర్మ అరుదైన రికార్డులు
- కేవలం 12 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 29 పరుగులు
- పవర్‌ప్లేలో అభిషేక్ ఇప్పటివరకు 99 సిక్సర్లు
- రోహిత్ శర్మ 98, మార్టిన్ గప్టిల్ 97 సిక్సర్లతో తర్వాతి స్థానాల్లో..
- ఇన్నింగ్స్ తొలి బంతికే అత్యధికసార్లు సిక్స్ కొట్టిన బ్యాటర్‌గా కూడా అభిషేక్ రికార్డు.
- తొలి బంతికే ఇప్పటివరకు 7 సార్లు సిక్స్ కొట్టిన అభిషేక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhishek Sharma: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ చేసింది 29 పరుగులే అయినా అరుదైన రికార్డులు నెలకొల్పాడు. క్రైస్ట్‌చర్చ్ వేదికగా 226 పరుగుల లక్ష్య ఛేదనలో అభిషేక్ కేవలం 12 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 29 పరుగులు చేసి మైఖేల్ బ్రేస్‌వెల్ బౌలింగ్‌లో ఆరో ఓవర్ నాలుగో బంతికి ఔటయ్యాడు. ఈ మ్యాచ్ లో మరో ఓపెనర్ సంజు శాంసన్‌తో కలిసి తొలి వికెట్‌కు 93 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
అయితే అభిషేక్ పెద్ద ఇన్నింగ్స్ ఆడకపోయినా టీ20 అంతర్జాతీయ క్రికెట్లో పవర్‌ప్లే సిక్సర్ల విషయంలో రోహిత్ శర్మ ప్రపంచ రికార్డును అధిగమించాడు. పవర్‌ప్లేలో ఇప్పటివరకు 99 సిక్సర్లు బాదిన అభిషేక్.. 98 సిక్సర్లతో ఉన్న రోహిత్ శర్మను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ లిస్ట్ లో మార్టిన్ గప్టిల్ 97 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. నేటి మ్యాచ్ తో టీ20 అంతర్జాతీయ క్రికెట్లో పవర్‌ప్లేలో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ల జాబితాలో అభిషేక్ శర్మ 99 సిక్సర్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ 98, మార్టిన్ గప్టిల్ 97, యూఏఈకి చెందిన ముహమ్మద్ వసీమ్ 95, ఐర్లాండ్ ఆటగాడు పాల్ స్టిర్లింగ్ 94 సిక్సర్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అభిషేక్ ఇప్పటివరకు టీ20 అంతర్జాతీయ క్రికెట్లో మొత్తం 146 సిక్సర్లు బాదాడు. కేవలం పవర్‌ప్లేలోనే 99 సిక్సర్లు సాధించడం అతడి దూకుడైన బ్యాటింగ్‌కు నిదర్శనంగా నిలుస్తుంది.
Also Read
- Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!
- Harry Brook: ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీతో హరీ బ్రూక్ విధ్వంసం..!
- Ind vs NZ: న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం.. 4 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు..!
- IND Vs NZ 1st T20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. తుది జట్టులో కీలక మార్పులు..
అభిషేక్ మరో అరుదైన ఘనతను కూడా సాధించాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో మ్యాట్ హెన్రీ వేసిన తొలి ఓవర్ చివరి బంతిని ఎదుర్కొన్న అభిషేక్.. తన తొలి బంతికే సిక్స్ బాదాడు. దీంతో టీ20 అంతర్జాతీయ క్రికెట్లో ఇన్నింగ్స్ తొలి బంతికే అత్యధికసార్లు సిక్స్ కొట్టిన బ్యాటర్‌గా కూడా నిలిచాడు. అభిషేక్ ఇప్పటివరకు 7 సార్లు తొలి బంతికే సిక్స్ కొట్టాడు. దీంతో ఆఫ్ఘనిస్థాన్ ఆటగాడు షఫీకుల్లా షిన్వారీ రికార్డును అధిగమించాడు. షిన్వారీ 6 సార్లు తొలి బంతికే సిక్స్ కొట్టగా.. సూర్యకుమార్ యాదవ్ 5 సార్లు ఈ ఘనత సాధించాడు. మొత్తంగా న్యూజిలాండ్ నిర్దేశించిన 226 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
తాజావార్తలు
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Chikkadpally: యువతితో అసభ్య ప్రవర్తన.. ఘర్షణలో డీఆర్డీవో ఉద్యోగి మృతి
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!
-
AP LocalBody Elections : తూర్పుగోదావరిలో ఎన్నికల వేడి.. రెండో రోజు భారీగా నామినేషన్లు
-
Shamonda Virus: ‘‘షమోండా వైరస్’’ కలకలం.. తొలి మానవ మరణం నమోదు..
ట్రెండింగ్
-
Home Remedies : తెల్ల సాక్సులపై నల్ల మరకలా? ఇలా సింపుల్ చిట్కాలతో వదిలించండి
-
Harry Brook: ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీతో హరీ బ్రూక్ విధ్వంసం..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP కెమెరా, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 లాంచ్..!
-
Home Cleaning : దీపావళి వేళ.. ఇంట్లో బల్లులు, బొద్దింకల బెడద ఎక్కువగా ఉందా? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Ind vs NZ: న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం.. 4 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు..!