Bangladesh to Lose Rs 325 Crore: టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్.. రూ. 325 కోట్ల నష్టం
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం ‘బుల్బుల్ కి ఘోర అవమానం..
- తాత్కాలిక ప్రభుత్వంలోని క్రీడల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ నిర్ణయంతో వరల్డ్ కప్ నుంచి బీసీసీ ఔట్..
- టీ20 ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకోవడంతో రూ. 325 కోట్ల నష్టం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh to Lose Rs 325 Crore: బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో తొలి టెస్ట్ శతకవీరుడిగా గుర్తింపు పొందిన అమీనుల్ ఇస్లాం ‘బుల్బుల్’ ఒకప్పుడు దేశానికి గర్వకారణంగా నిలిచారు. దాదాపు 25 సంవత్సరాల క్రితం భారత్‌తో జరిగిన బంగ్లాదేశ్ తొలి టెస్ట్ మ్యాచ్‌లో సాధించిన శతకం ఆయన కెరీర్‌కు చిరస్థాయిగా నిలిచింది. అయితే, తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు మాత్రం బుల్బుల్‌కు తీవ్ర అవమానకరంగా మారింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) చరిత్రలోనే తొలిసారిగా, ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జాతీయ జట్టు ఒక ఐసీసీ టోర్నమెంట్ నుంచి తప్పుకోవాలనే నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామానికి ప్రధాన కారణం బంగ్లా తాత్కాలిక ప్రభుత్వంలోని క్రీడల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ తీసుకున్న కఠిన వైఖరే. ఇక, భద్రతా కారణాలను “జాతీయ ప్రతిష్ఠ”తో ముడిపెట్టి భారత్ లో పర్యటించడానికి అవకాశం లేదని స్పష్టం చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది.
Read Also: Cheekatilo Review: చీకటిలో రివ్యూ.. పెళ్ళయ్యాక శోభిత మొదటి సినిమా ఎలా ఉందంటే?
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
అయితే, తాత్కాలిక ప్రభుత్వ నిర్ణయంతో బంగ్లాదేశ్ క్రికెట్‌కు ఆర్థికంగా కూడా భారీ దెబ్బగా మారే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటే, బీసీబీకి ఐసీసీ నుంచి వచ్చే వార్షిక ఆదాయంలో సుమారు 325 కోట్ల బంగ్లాదేశీ టాకాలు (దాదాపు 27 మిలియన్ డాలర్లు) నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, బ్రాడ్‌కాస్టింగ్ హక్కులు, స్పాన్సర్‌షిప్‌లు, ఇతర వాణిజ్య ఆదాయాలను కలిపితే మొత్తం ఆర్థిక సంవత్సరంలో నష్టం 60 శాతం లేదా అంతకంటే ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కాగా, ఈ పరిణామాలతో భారత్- బంగ్లాదేశ్ ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలపై కూడా పడే ఛాన్స్ ఉంది. ఆగస్టు- సెప్టెంబర్ నెలల్లో జరగాల్సిన భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటన కూడా రద్దయ్యే అవకాశాలు మెుండుగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ టూర్ కి సంబంధించిన టీవీ హక్కుల విలువ కనీసం 10 ద్వైపాక్షిక సిరీస్‌లకు సమానమని భావిస్తుండటంతో.. అది రద్దైతే బీసీబీకి భారీగా ఆర్థిక నష్టం తప్పదని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.
Read Also: Swayambhu : నిఖిల్ స్వయంభు కొత్త రిలీజ్ డేట్ ఇదే
ఇక, బంగ్లాదేశ్‌లో ఫిబ్రవరి 12వ తేదీన ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆసిఫ్ నజ్రుల్ రాజకీయ ప్రభావం తగ్గవచ్చని అంచనాలు కనిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం వల్ల బీసీబీ అధ్యక్షుడు బుల్బుల్ ఎదుర్కొన్న పరాభవం మాత్రం అతడికి జీవిత కాలం పాటు ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుందని క్రీడా వర్గాలు అంటున్నాయి. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకి చెందిన ఒక వర్గం తెలిపిన వివరాల ప్రకారం.. సమావేశంలో ఎక్కువగా మాట్లాడింది ఆసిఫ్ నజ్రుల్ మాత్రమేనని, బుల్బుల్ చాలా అరుదుగా మాత్రమే స్పందించారని చెప్పారు. ఆటగాళ్లు దాదాపుగా మౌనంగా ఉన్నారు, సీనియర్ ఆటగాడు తమీమ్ ఇక్బాల్‌కే ఇలాంటి పరిస్థితి ఎదురైతే తమకు ఇంకా కఠిన పరిణామాలు ఎదురవుతాయనే భయం వారిలో స్పష్టంగా కనిపించిందని పేర్కొంది. అలాగే, ఈ సమావేశం అనంతరం బుల్బుల్ తీవ్ర నిరాశలో కనిపించారని, నజ్రుల్‌ను ఒప్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని బీసీబీలోని ఓ వర్గం ఆరోపించింది. తాజా పరిస్థితుల్లో బంగ్లాదేశ్ వరల్డ్ కప్‌కు వెళ్లలేమనే పరిస్థితి ఉన్నా, మాకు తాత్కాలిక ప్రభుత్వం నుంచి అల్టిమేటం రావడంతో.. వరల్డ్ కప్ ఆడే అవకాశాన్ని దాదాపుగా కోల్పోయం అన్నారు.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!