తాత్కాలిక ప్రభుత్వ నిర్ణయంతో బంగ్లాదేశ్ క్రికెట్‌కు ఆర్థికంగా కూడా భారీ దెబ్బగా మారే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటే, బీసీబీకి ఐసీసీ నుంచి వచ్చే వార్షిక ఆదాయంలో సుమారు 325 కోట్ల బంగ్లాదేశీ టాకాలు (దాదాపు 27 మిలియన్ డాలర్లు) నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
Bangladesh Boycott T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్‌కప్ 2026 కోసం తమ జట్టును భారత్‌కు పంపించబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) అధికారికంగా ప్రకటించింది. ఇవాళ (జనవరి 22న) జరిగిన అంతర్గత సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీబీ వెల్లడించింది.
T20 World Cup controversy: భారత్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్నందున బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఆ దేశ క్రికెట్ బోర్డు (BCB)కి కీలక సూచనలు జారీ చేసింది. 2026 టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లా.. భారత్‌లో ఆడాల్సిన మ్యాచ్‌ల వేదికలను శ్రీలంకకు తరలించాలని ఐసీసీని అభ్యర్థించింది.
BCCI vs BCB: ఐసీసీ మెన్స్ T20 వరల్డ్‌కప్ 2026లో బంగ్లాదేశ్ జట్టు ఆడాల్సిన మ్యాచ్‌లను భారత్ వెలుపల నిర్వహించేలా వేదిక మార్పు చేయాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం, ఆ దేశ క్రికెట్ బోర్డు (BCB)కు అధికారిక ఆదేశాలు ఇచ్చింది.
బంగ్లాదేశ్ మహిళా జట్టు ఫాస్ట్ బౌలర్ జహనారా ఆలమ్.. ఆ జట్టు కెప్టెన్ నిగర్ సుల్తానా జోటీపై తీవ్ర ఆరోపణలు చేసింది. జూనియర్ ఆటగాళ్లను నిగర్ కొట్టేదని, కొన్నిసార్లు అయితే చెంప దెబ్బలు కూడా కొట్టేదని చెప్పింది. డ్రెస్సింగ్ రూమ్‌లో సరైన వాతావరణం కల్పించడంలో బంగ్లా కెప్టెన్ విఫలమైందని పేర్కొంది. చాలా మంది ప్లేయర్లు తమ బాధని చెప్పుకొని బాధపడేవారని జహనారా చెప్పుకొచ్చింది. అయితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఈ ఆరోపణలను ఖండించింది. గత ఏడాది…