టీ20 క్రికెట్ ప్రపంచకప్ గెలిచి స్వదేశానికి చేరుకున్న టీమ్ ఇండియాకు దేశం ఘనంగా స్వాగతం పలుకుతోంది. ముంబై విమానాశ్రయానికి చేరుకోగానే భారత క్రికెట్ జట్టు విమానానికి వాటర్ క్యానన్ సెల్యూట్‌తో స్వాగతం పలికారు. భారత్‌లో ఒక బృందానికి వాటర్ ఫిరంగులతో స్వాగతం పలకడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు ఈ సంప్రదాయం కొత్త విమానాలను స్వాగతించడానికి లేదా కొత్త విమానాశ్రయంలో మొదటి విమాన సర్వీసులో మాత్రమే ఉపయోగించబడింది. కొన్ని చోట్ల.. ఎయిర్‌లైన్‌తో అనుబంధించబడిన వ్యక్తుల ప్రత్యేక విజయాలకు ఈ రకమైన స్వాగతం లభించింది. కానీ ఏవియేషన్ సర్వీస్‌తో పాటు, రోహిత్ శర్మ బృందానికి స్వాగతం పలికిన విధానం, భారతదేశంలోని ఏ ప్రధాన మంత్రికి లేదా ముఖ్యమంత్రికి ఇంతటి స్వాగతం లభించలేదు.
READ MORE: Anant ambani-radhika wedding: 60 మంది డ్యాన్సర్లతో కార్యక్రమం.. ఈ ప్రోగ్రామ్ ఎప్పుడంటే..!
కాగా.. బార్బడోస్ నుంచి ఢిల్లీకి, ఆ తర్వాత ఢిల్లీ నుంచి ముంబైకి చేరుకున్న ఆటగాళ్లకు స్వాగతం పలికేందుకు గ్రాండ్ రోడ్‌షో నిర్వహించారు. విక్టరీ పరేడ్ కోసం లక్షలాది మంది ప్రజలు ముంబై వీధుల్లోకి వచ్చారు. టీమ్ ఇండియాతో కూడిన విస్తారా ప్రత్యేక విమానం ముంబై విమానాశ్రయానికి చేరుకోగానే, ఆటగాళ్లకు ఇరువైపుల నుంచి విమానంపై నీటి జల్లులు కురిపించి స్వాగతం పలికారు. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ప్రధానితో కలిసి భారత ఆటగాళ్లంతా అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా ప్రతీ క్రికెటర్‌ను ప్రధాని ఆప్యాయంగా పలకరించి.. అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ముంబైలో విక్రోరీ ర్యాలీ కొనసాగుతోంది. ఈ ర్యాలీకి లక్షల సంఖ్యలో జనాలు హాజరయ్యారు. తమ అభిమాన క్రికెటర్లను చూసేందుకు తండోపతండాలుగా తరలి వచ్చారు. దీంతో మహానగరంలోని రోడ్లు రద్దీగా మారాయి.