మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం కానుంది. మార్చి 31 నుంచి ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. అయితే ఐపీఎల్ అనగానే గత రెండు సీజన్ల నుంచి ఎంఎస్ ధోనీ ఈ మెగాటోర్నీకి వీడ్కోలు పలుకుతాడు అంటూ వార్తాలు వస్తూనే ఉన్నాయి. కానీ ఎప్పటికప్పుడు అతడు ఆడుతూనే ఉన్నాడు.
Also Read : K Laxman: యువత బతుకుల్ని తెలంగాణ ప్రభుత్వం ఆగం చేసింది
కొంతకాలం క్రితం అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన అతడు తాజా సీజన్ కోసం ప్రాక్టీస్ ను కూడా ప్రారంభించేశాడు. అయితే ఎప్పటిలాగే ఈ సీజన్ తర్వాత ధోనీ ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే ప్రచారం సాగుతుంది. క్రికెట్ విశ్లేషకులు కూడా ఇదే అంచనా వేస్తున్నారు.. అయితే తాజాగా ఇదే విషయాన్ని టీమిండియా మాజీ ఆటగాడు సురేశ్ రైనా దృష్టికి తీసుకెళ్లగా.. అతడు దీనిపై అదిరిపోయే సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం సురేశ్ రైనా లెజెండ్స్ లీగ్ క్రికెట్ ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే ప్రెస్ కాన్ఫెరెన్స్ లో అతడు మాట్లాడుతూ.. మహీ వచ్చే సీజన్ లోనూ తప్పకుండా ఆడతాడని క్లారిటీ ఇచ్చాడు.
Also Read : Heavy Rains: ఐఎండీ తాజా వార్నింగ్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
ఐపీఎల్ 2024 సీజన్ లోనూ మహీ ఆడాలని కోరుకుంటున్నాను.. అయితే అతడి ఉద్దేశం ఏంటనేది మనకు క్లారిటీగా లేదు.. తెలీదు.. ఆయన బ్యాటింగ్ ఇంకా బాగానే చేస్తున్నాడు.. ఫిటి నెస్ లోనూ అతడు సూపర్.. అయితే ఈ సీజన్ లో ధోనీ ప్రదర్శనపై వచ్చే సీజన్ ఆడాలా వద్దా అనేది ఆధారపడి ఉంటుందని రైనా అన్నారు. ఎందుకంటే ఏడాది నుంచి ఆడని ధోనీకి సవాల్ తప్పదు.. అలాగే అంబటి రాయుడుతో టీమ్ ఇప్పటికే చాలా స్ట్రాంగ్ గా ఉంది. టీమ్ లో చాలా మంది యంగ్ ప్లేయర్స్ తామెంటో నిరూపించుకుంటున్నారు. డేవన్ కాన్వే, జడేజా,రుతురాజ్ గైక్వాడ్, దీపక్ చాహర్, బెన్ స్టోక్స్.. ఇలా సీనియర్స్,యంగ్ ప్లేయర్స్ తో కూడిన టీమ్ రెడీగా అయితే ఉందని సురేశ్ రైనా చెప్పుకొచ్చాడు.
Also Read : Naga Chaitanya: ఎట్టకేలకు నాగచైతన్య ఓ ఇంటివాడయ్యాడోచ్..?
ఇప్పటికైతే మహీ ఫోన్ లోనూ అందుబాటులో ఉండడని చాలా మంది క్రికెటర్లు అంటుంటారు. అయితే తాను మాత్రం ధోనీతో టచ్ లోనే ఉన్నట్లు రైనా పేర్కొన్నాడు. తాను మహీ ఎప్పుడూ టచ్ లోనే ఉంటాం.. ఇప్పుడు
అతడు బాగా కఠినంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు.. చెన్నై సూపర్ కింగ్స్ సోషల్ మీడియాలోని వీడయోలను చూస్తే మీకే అర్థమవుతుందని రైనా తెలిపారు. నెట్స్ లో అదిరిపోయే భారీ షాట్లు బాదేస్తున్నాడు.. ఇలానే మ్యాచ్ లోనూ ఆడితే గెలుపొందడం పక్క అని సురేశ్ రైనా అన్నారు.