Naga Chaitanya: టైటిల్ చూసి.. ఏంటి నిజమా.. చై ఇంకో పెళ్లి చేసుకున్నాడా..? ఏంటి అని ఆశ్చర్యపోకండి. నాగచైతన్య ఒక ఇంటివాడయ్యాడు అంటే.. కొత్త ఇంట్లో గృహప్రవేశం చేశాడు.విషయం ఏంటంటే.. చై- సామ్ పెళ్లి తరవాత ఒక ప్లాట్ ను తమ టేస్ట్ కు తగ్గట్టు కొనుగోలు చేసుకొని అన్ని సమకూర్చున్నారు. ఆ ప్లాట్ ఎవరిదో కాదు.. నటుడు మురళి మోహన్ దే.. ఆయనే ఈ విషయాన్ని స్వయంగా చెప్పుకొచ్చారు. వేరేవాళ్లకి ఇద్దామనుకున్నా లోపే సామ్- చై వచ్చి తనతో మాట్లాడారని, వారి మాట కాదనలేక ప్లాట్ ఇచ్చినట్లు చెప్పుకొచ్చాడు. ఇక వీరి విడాకుల తరువాత ఆ ప్లాట్ ను సామ్ కు ఇచ్చేసి చై బయటికి వచ్చేశాడు. నాగ్ వాళ్ళ ఇంట్లో కూడా ఉండకుండా హోటల్స్ లోనే ఉండడం అలవాటు చేసుకున్నాడు. ఇక రెండేళ్ల క్రితం చై తనకంటూ ఒక సొంత ఇల్లును నిర్మించుకోవాలని.. నాగార్జున ఇంటికి దగ్గర్లో కొంత స్థలం కొని తన అభిరుచికి తగ్గట్లు ఇంటిని నిర్మించుకున్నాడట.
Custody Teaser: గాయపడిన మనసు ఆ మనిషిని ఎంత దూరమైన తీసుకెళ్తోంది
ఇక పదిరోజుల క్రితమే ఆ ఇంట్లో అడుగుపెట్టాడట చై. తన థింగ్స్ అన్నింటిని నాగార్జున ఇంటి నుంచి తెప్పించేశాడని టాక్. ఇక ఇకనుంచి ఆయన అక్కడే ఉండనున్నాడట. తన అభిరుచులకు తగ్గట్లు ఇంట్లోనే మంచి స్విమ్మింగ్ పూల్, థియేటర్, జిమ్.. గార్డెన్ జాగ్రత్తగా డిజైన్ చేయించుకున్నాడట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే చై.. ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. కస్టడీ సినిమాతో ఆ హిట్ వస్తుందని నమ్ముతున్నాడు. మరి ఆ సినిమా చై కు ఎలాంటి హిట్ ను అందిస్తుందో చూడాలంటే మే వరకు ఆగాల్సిందే.