Sunrisers Hyderabad Scored 83 Runs In First 10 Overs: అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య పోరు సాగుతున్న విషయం తెలిసిందే! టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న సన్‌రైజర్స్ జట్టు.. తొలి 10 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ పుణ్యమా అని.. ఎస్ఆర్‌హెచ్ స్కోరు బోర్డు పరుగులు తీస్తోంది. ఓపెనర్‌గా వచ్చిన అభిషేక్.. క్రీజులోకి అడుగుపెట్టినప్పటి నుంచే అద్భుతంగా ఆడుతున్నాడు. ఇతర బ్యాటర్లు మైదానంలో అడుగుపెట్టినట్టే పెట్టి పెవిలియన్ చేరుతుండగా.. అభిషేక్ ఒక్కడే ఢిల్లీ బౌలర్లను షేక్ ఆడిస్తున్నాడు. ఢిల్లీ బౌలర్లతో చెడుగుడు ఆడేసుకుంటున్నాడు. దీంతో.. అతడు 25 బంతుల్లోనే అర్థశతకం పూర్తి చేసుకున్నాడు.

USA: టెక్సాస్‌లో దారుణం.. చిన్నారితో సహా ఐదుగురిని కాల్చిచంపిన దుండగుడు..
అయితే.. మార్ర్కమ్, హ్యారీ బ్రూక్ వంటి ఖరీదైన ఆటగాళ్లు మరోసారి నిరాశపరిచారు. అప్పుడెప్పుడో ఒక మ్యాచ్‌లో చెలరేగి ఆడిన ఈ ఆటగాళ్లు.. ఆ తర్వాతి నుంచి పేలవ ప్రదర్శనలతో డిజప్పాయింట్ చేస్తూనే ఉన్నారు. మార్ర్కమ్ 13 బంతులు ఆడి, కేవలం 8 పరుగులే చేసి ఔటయ్యాడు. ఒక భారీ షాట్ కొట్టబోతే.. బౌండరీ లౌన్ వద్ద అక్షర్ పటేల్ దాన్ని క్యాచ్‌గా అందుకున్నాడు. ఆ వెంటనే హ్యారీ బ్రూక్ డకౌట్‌గా వెనుదిరిగాడు. మార్ష్ బౌలింగ్‌లో షాట్ కొట్టబోతే.. అది నేరుగా అక్షర్ చేతుల్లోకి వెళ్లింది. ఇలా వీరిద్దరు తక్కువ స్కోర్లకే జెండా ఎత్తేశారు. అంతకుముందు వచ్చిన మయాంక్ అగర్వాల్ (5), రాహుల్ త్రిపాఠి (10) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయారు.
Dinesh Karthik : అండర్-16 ఆటగాళ్లకు దినేశ్ కార్తీక్ సలహాలు.. ఓవరాక్షన్ అంటూ ట్రోల్స్