ఈనెల 26 నుంచి టీమిండియాతో జరగనున్న మూడు టెస్టుల సిరీస్‌లో దక్షిణాఫ్రికా జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ టీమ్ స్టార్ బౌలర్ ఆన్రిచ్ నార్జ్ గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అయితే అతడి స్థానంలో ఎవరినీ ఎంపిక చేయలేదని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఇప్పటికే 20 మంది సభ్యులతో జట్టును ప్రకటించిన నేపథ్యంలో నార్జ్ స్థానంలో కొత్త ఆటగాడిని సెలక్ట్ చేయాల్సిన అవసరం లేదని బోర్డు అభిప్రాయపడింది.
Read Also: అత్యాచారం కేసులో చిక్కుకున్న స్టార్ క్రికెటర్
కాగా ఇటీవల మూడు ఫార్మాట్లలో దక్షిణాఫ్రికా జట్టుకు బౌలర్ నార్జ్ కీలక బౌలర్‌గా ఎదిగాడు. రబాడతో కలిసి జట్టుకు విజయాలు అందించడంతో అతడు కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటివరకు 12 టెస్టుల ఆడిన నార్జ్ 47 వికెట్లు పడగొట్టాడు. మూడు సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. మరోవైపు దక్షిణాఫ్రికా టీమ్‌లో సీనియర్లు లేకపోవడం టీమిండియాకు ప్లస్ పాయింట్ అవుతుందని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. దక్షిణాఫ్రికా జట్టులో సీనియర్ ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్, డుప్లెసిస్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించగా.. స్టార్ వికెట్ కీపర్ డికాక్టీమిండియాతో టెస్టు సిరీస్‌కు దూరంగా ఉంటాడని తెలుస్తోంది. దీంతో దీనిని సదావకాశంగా భావించి టెస్టు సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేయాలని సన్నీ అభిప్రాయపడ్డాడు.