విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో వస్తున్న హ్యాట్రిక్ మూవీపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి, అయితే, ఈ ప్రాజెక్టులోకి సీనియర్ నిర్మాత సురేష్ బాబు ప్రవేశించబోతున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. ఎందుకంటే టాలీవుడ్‌లో సురేష్ బాబు అంటేనే ఒక బ్రాండ్. ఆయన నిర్మాణంలో ఉండే క్రమశిక్షణ, బడ్జెట్ నియంత్రణ సహా ప్రతి విషయంలోనూ ఆయన ఇన్వాల్వ్ మెంట్ ఇతర నిర్మాతల కంటే భిన్నంగా ఉంటుంది. గతాన్ని పరిశీలిస్తే.. సురేష్ బాబు గీసిన గీత దాటకుండా పనిచేయడం కొంతమంది దర్శకులకు ఇబ్బందిగా మారిన సందర్భాలు ఉన్నాయి. అయితే మరోపక్క అనిల్ రావిపూడి కూడా సాధారణ డైరెక్టర్ కాదు. వరుస విజయాలతో ‘మినిమం గ్యారెంటీ’ అనే ముద్ర వేయించుకున్న మేకర్.
Also Read :Tollywood – RSS : టాలీవుడ్ స్టార్ హీరోలతో ఆర్ఎస్ఎస్ చీఫ్ భేటీ.. అసలు కారణం ఇదేనా?
వెంకటేష్‌కు ‘F2’, ‘F3’, సంక్రాంతికి వస్తున్నాం వంటి భారీ హిట్స్ ఇచ్చి, ఆయన బాడీ లాంగ్వేజ్‌ను పర్ఫెక్ట్‌గా ఒడిసిపట్టిన డైరెక్టర్ అనిల్. అనిల్ రావిపూడి స్క్రిప్ట్ విషయంలో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని కలిగి ఉంటారు. బ్యాక్-టు-బ్యాక్ సక్సెస్‌లలో ఉన్నప్పుడు సహజంగానే ఏ దర్శకుడైనా ‘అన్‌కండిషనల్ ఫ్రీడమ్’ కోరుకుంటారు. కానీ సురేష్ బాబు బాధ్యత తీసుకున్నారంటే.. ప్రొడక్షన్ వాల్యూస్ నుండి మేకింగ్ వరకు ఆయన పర్యవేక్షణ ఉంటుంది. గతంలో కొంతమంది దర్శకులు ఆయన రూల్స్ వల్ల తమ క్రియేటివిటీకి బ్రేకులు పడుతున్నాయని భావించేవారు. అనిల్ రావిపూడి లాంటి కమర్షియల్ లెక్కల మాస్టర్‌కు పూర్తి స్వేచ్ఛ ఇస్తేనే ఆ అవుట్‌పుట్ అద్భుతంగా వస్తుంది. మరి సురేష్ బాబు తన స్టైల్ పక్కన పెట్టి అనిల్ కి ఫ్రీ హ్యాండ్ ఇస్తారా అనేది ఆసక్తికరం. వెంకటేష్‌తో అనిల్‌కు ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా, సురేష్ బాబు కూడా ఈ విషయంలో కాస్త వెనక్కి తగ్గి అనిల్ కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్.