KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత మాజీ క్రికెటర్, పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ వసీం జాఫర్ టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌కు రాహుల్ సారథిగా, జాఫర్ బ్యాటింగ్ కోచ్‌గా పనిచేసిన సమయంలో ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఇటీవల ఒక క్రికెట్ టాక్ షోలో మాట్లాడిన జాఫర్, కేఎల్ రాహుల్ నాయకత్వ బాధ్యతలు తీసుకోకపోవడమే అతని వ్యక్తిత్వానికి, ఆటతీరుకు ఎంతో మంచిదని అభిప్రాయపడ్డారు.
కప్టెన్సీ భారం లేకపోతే రాహుల్ తన సహజసిద్ధమైన గేమ్‌ను స్వేచ్ఛగా ఆడుతాడని, ఏటా ఐపీఎల్లో 500 నుంచి 600 రన్స్ చేసే సత్తా అతనికి ఉందనేది జాఫర్ అభిప్రాయం. రాహుల్ అత్యంత నమ్మకమైన ఆటగాడని, తన ఒంటిచేతి ప్రదర్శనతో సీజన్లో 2-3 మ్యాచ్‌లను గెలిపించగలడని ప్రశంసించారు. అయితే, అతని మనస్తత్వానికి కప్టెన్సీ అనేది ఒక అదనపు ఒత్తిడిని పెంచుతుందని, దానివల్ల అతని పూర్తి సామర్థ్యంతో ఆడలేకపోతున్నారని స్పష్టం చేశారు. పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్‌జెయింట్స్ టీమ్ లను నడిపించిన రాహుల్, ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారినప్పుడు కూడా కప్టెన్సీకి దూరంగా ఉండటమే శ్రేయస్కరమని భావించారు.
Also Read
- WPL 2027 మినీ వేలం పూర్తి.. 25 మంది ఆటగాళ్ల కొనుగోలు.. 5 జట్ల పూర్తి స్క్వాడ్ వివరాలు ఇవే..!
- ICC Rankings: జడేజా 1,683 రోజుల ఆధిపత్యానికి తెర.. నంబర్-1 ఆల్‌రౌండర్ స్థానాన్ని కోల్పోయిన జడ్డూ..
- WPL Auction 2027: వైభవ్ సూర్యవంశీ మాదిరే.. డబ్ల్యూపీఎల్‌లో అత్యంత పిన్న వయస్కురాలు.. ఎవరీ ఉమా కాశ్వి!
- Kumar Sangakkara: విమానాశ్రయంలో వివక్ష.. సంగక్కర సంచలన ఆరోపణలు!
ప్రస్తుతం భారత్-శ్రీలంక మధ్య గాల్, కొలంబో వేదికలుగా జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌లో కేఎల్ రాహుల్ పాత్ర అత్యంత కీలకం కానుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగమైన ఈ సిరీస్‌లో అనుభవజ్ఞుడైన సీనియర్ బ్యాటర్‌గా జట్టు సమతుల్యతను నిలబెట్టే బాధ్యత అతనిపై ఉంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా వచ్చి 40 పరుగులు చేసి మంచి లయ కనబరిచిన రాహుల్, కప్టెన్సీ ఒత్తిడి లేకుండా ఈ టెస్టు సిరీస్‌లో చెలరేగిపోతాడని అభిమానులు ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
Chennai: పట్టపగలే దారుణం.. బిర్యానీ సెంటర్ క్యాషియర్‌పై కత్తులతో దాడి, నగదు లూటీ..!
-
NEET UG: నీట్-యూజీ వివాదం ఎఫెక్ట్.. పరీక్షల సంస్కరణలపై పార్లమెంటరీ కమిటీ ఫోకస్..
-
PNB Fraud: పీఎన్బీలో భారీ కుంభకోణం.. ఖాతాదారులకు తెలియకుండానే రూ.35 కోట్లు మాయం.!
-
Maruti Suzuki Fronx: 28 కిలోమీటర్ల మైలేజ్.. రూ. 6.90 లక్షల ధర.. కొత్త మారుతి ఫ్రాంక్స్ వచ్చేస్తోంది..!
-
AP Cabinet: ముగిసిన కేబినెట్ భేటీ.. 48 ప్రతిపాదనలకు ఆమోదం.. స్థానిక ఎన్నికలపై సీఎం కీలక సూచనలు!
ట్రెండింగ్
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..
-
WPL 2027 మినీ వేలం పూర్తి.. 25 మంది ఆటగాళ్ల కొనుగోలు.. 5 జట్ల పూర్తి స్క్వాడ్ వివరాలు ఇవే..!
-
బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త ఫీచర్లతో KTM 200 Duke లాంచ్..!
-
WPL Auction 2027: వైభవ్ సూర్యవంశీ మాదిరే.. డబ్ల్యూపీఎల్‌లో అత్యంత పిన్న వయస్కురాలు.. ఎవరీ ఉమా కాశ్వి!