Rohit- Kohli Retirement: టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జోరుగా జరుగుతోంది. వీరిద్దరూ త్వరలో వన్డేలకు కూడా వీడ్కోలు చెబుతారన్న రూమర్స్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. వారికి గ్రాండ్ ఫేర్వెల్ ఇవ్వాలనే చర్చలు ఊపందుకోవడంతో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తీవ్రంగా మండిపడ్డారు.
Read Also: OG: పవన్ – ప్రియాంక మెలోడీ సాంగ్ రిలీజ్ డేట్ లాక్! ఫ్యాన్స్ ఊహించని సర్ప్రైజ్
అసత్య ప్రచారంపై ఆగ్రహం
సోషల్ మీడియాలో ఇలాంటి వదంతులు ఎలా వస్తున్నాయో అర్థం కావడం లేదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు శుక్లా పేర్కొన్నారు. ఇప్పటికే రోహిత్, కోహ్లీ టెస్టులు, టీ20లకు గుడ్ బై చెప్పారు.. కానీ, వన్డేల విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ కోసం రోహిత్, విరాట్ సిద్ధమవుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న శుక్లాను.. సచిన్‌లా రోహిత్, విరాట్‌కి ఫేర్వెల్ ఇస్తారా? అని హోస్ట్ ప్రశ్నించగా, ఆయన ఈ ఘాటుగా స్పందించారు.
Read Also: Kotamreddy Sridhar Reddy: మానవత్వంతో శ్రీకాంత్‌కి పెరోల్ లేఖ.. వేరే ఉద్దేశ్యం లేదు..
ఎందుకు ఇంత కంగారు?
ఇక, రోహిత్ శర్మ, విరాట్ కేవలం వన్డేల్లో కొనసాగుతున్న సమయంలో ఫేర్వెల్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అని రాజీవ్ శుక్లా అడిగారు. మీలాంటి వారు ఎందుకు ఇంత కంగారు పడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. బీసీసీఐ ఎవరినీ రిటైర్ అవ్వమని చెప్పదు.. మా పాలసీ క్లియర్ గా ఉంటుంది.. ఏ ఆటగాడైనా తన సొంత నిర్ణయం తీసుకుంటాడు.. ఆ నిర్ణయాన్ని తాము గౌరవించాల్సిందే అని శుక్లా స్పష్టం చేశారు.
ఫామ్‌లోనే ఉన్న రోహిత్–కోహ్లీ
కాగా, విరాట్ కోహ్లీ ఇప్పటికీ ఫిట్‌గా ఉన్నాడు.. రోహిత్ శర్మ అద్భుతంగా ఆడుతున్నాడు అని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. అలాంటప్పుడు సోషల్ మీడియాలో వారి ఫేర్వెల్ గురించి ఎందుకు అడుగుతున్నారు? అని ఘాటుగా మండిపడ్డిరు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం ఆపేయాలని కోరారు. శుక్లా వ్యాఖ్యలతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే రిటైర్మెంట్ రూమర్స్‌కు పూర్తి స్టాప్ పడినట్లే అని చెప్పాలి.
https://twitter.com/45__rohan/status/1958929636626505806