సెప్టెంబర్ 28న దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన ఆసియా కప్ ఫైనల్ 2025లో భారత్ గెలిచిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం స్టేడియంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పీసీబీ చీఫ్, ఏసీసీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోవడానికి టీమిండియా ప్లేయర్స్ తిరస్కరించారు. దాంతో నఖ్వీ ఆసియా కప్ ట్రోఫీతో పాటు భారత ఆటగాళ్లకు దక్కాల్సిన విజేత పతకాలను కూడా హాటల్‌కు తీసుకెళ్లిపోయాడు. దాంతో పీసీబీ, బీసీసీఐ మధ్య వివాదం చెలరేగింది.…
BCCI President: భారత క్రికెట్ నియంత్రణ మండలిలో కీలక మార్పు చోటు చేసుకుంది. టీమిండియా 1983 వరల్డ్ కప్ హీరో రోజర్ బిన్ని బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో బోర్డు వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న రాజీవ్ శుక్ల తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నికలు జరిగే వరకు శుక్లానే బోర్డును నడిపించనున్నారు. ఈ క్రమంలో తాజాగా నిర్వహించిన బీసీసిఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం రాజీవ్ శుక్లా నేతృత్వంలో…
చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన దురదృష్టకర తొక్కిసలాట సంఘటనపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమని ఆయన వాపోయారు. వేడుకల నిర్వహనపై అసహనం వ్యక్తం చేశారు. నిర్వాహకులు వేడుకలను బాగా ప్లాన్ చేసి ఉండాల్సిందన్నారు. ప్రజలు తమ క్రికెటర్ల పట్ల పిచ్చిగా ఉన్నారన్నారు. ఈ తొక్కిసలాట ఘటనపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడారు. అభిమానులు ఎక్కువగా తరలిరావడంతో ఇలాంటి పరిస్థితిని నివారించడానికి ప్రభుత్వం రోడ్‌షోను…
పహల్గాంలోని బైసరన్ లోయలో ఉగ్రవాదులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. మంగళవారం సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు.. పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఉగ్రదాడికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఉగ్రదాడి నేపథ్యంలో భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో కూడా పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడే ప్రసక్తే లేదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా…
విరాట్ కోహ్లీపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారులు ప్రశంసల జల్లు కురిపించారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. ఈ క్రమంలో మాజీ బీసీసీఐ చైర్మన్, మాజీ క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్, బోర్డు వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమల్ ప్రశంసించారు.
రాజీవ్ శుక్లా తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు. మహేంద్ర సింగ్ ధోనీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం అతడి వ్యక్తిగతం అన్నారు. అయితే, బెంగాల్ రాజకీయాల్లోకి వస్తారని నేను అనుకున్నాను.. ఎంఎస్ ధోనీ రాజకీయాల్లో కూడా బాగా రాణించగలడు.
వీసా క్లియరెన్స్ ఆలస్యం కావడంతో నేడు (సోమవారం) బీసీసీఐ ప్రెసిడెంట్, వైఎస్ ప్రెసిడెంట్ పాకిస్తాన్ కు చేరుకున్నారు. ఈ ఇద్దరూ వాగా బార్డర్ ద్వారా జెడ్ ప్లస్ సెక్యూరిటీతో పాక్ కు వెళ్లారు.
బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా దాయాది దేశమైన పాకిస్తాన్‌కు వెళ్లనున్నారు. ఆసియా కప్-2023 ప్రారంభ వేడులకు హాజరు కావాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పంపిన ఆహ్వానం మేరకు వీరిరువురు పాక్ కు పయనం కానున్నారు.
BCCI President Roger Binny, Vice Rajeev Shukla To Travel To Pakistan for Asia Cup 2023: పాకిస్థాన్, శ్రీలంక వేదికలుగా ఆసియా కప్ 2023 ఆగస్ట్ 30 నుంచి ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌లో నాలుగు మ్యాచ్‌లు, లంకలో మిగతా మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆసియా కప్ 2023 ఆతిథ్య హక్కులు పీసీబీ వద్దే ఉన్నా.. దాయాది దేశాల మధ్య ఉన్న విబేధాల కారణంగా పాకిస్థాన్ వచ్చే ప్రసక్తే లేదని బీసీసీఐ చెప్పింది.…