Sajjala Ramakrishna Reddy: విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వర్సెస్ తెలంగాణ సర్కార్‌గా మారుతోంది.. దీనిపై స్పందించిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఒక సీరియస్ అంశంపై స్పందించే తీరా ఇది? అని ప్రశ్నించిన ఆయన.. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో అందరి కంటే ఎక్కువగా స్పందించింది సీఎం వైఎస్ జగనే అన్నారు.. తెలంగాణ మంత్రి కేటీఆర్ మాటల అర్ధం కూడా ఇదేనన్న ఆయన.. స్టీల్ ప్లాంట్ ను ఏ విధంగా రక్షించుకోవచ్చు అనే అంశం పై ముఖ్యమంత్రి కొన్ని సూచనలు చేశారు.. క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలని సీఎం కేంద్రాన్ని కోరారు.. స్టీల్ ప్లాంట్ కు ఉన్న ఏడు వేల ఎకరాల భూమిని తాకట్టు పెట్టి ఆర్ధికంగా ప్లాంట్ ను ఆదుకోవచ్చు అనేది ఒక ప్రతిపాదనగా ఉందన్నారు.. అసలు ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకటనలో ఏముందో కూడా చూడకుండా రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారు అని మండిపడ్డారు..
Read Also: Thota ChandraSekhar: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ.. బీఆర్ఎస్ వైఖరి స్పష్టం చేసిన తోట
40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు, ఆయన పార్టీ కూడా అసలు కేంద్ర ప్రకటనలో ఏముందో చూడరా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సజ్జల.. తెలంగాణ ప్రభుత్వం, ఇతర సంస్థలకు పాల్గొనే అవకాశం ఉందా అనేది గమనించరా? అని నిలదీసిన ఆయన.. పరిమితమైన కార్యకలాపాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది.. అయినా దిక్కు మాలిన రాజకీయాలు చేస్తున్నారు అంటూ ఫైర్ అయ్యారు.. ప్రైవేటీకరణ ఛాంపియన్ చంద్రబాబు అని చిన్న పిల్లలను అడిగినా చెబుతారంటూ ఆరోపణలు గుప్పించారు.. ప్రైవేటైజేషన్ ఎ సక్సెస్ స్టోరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు తన మనసులో మాట చెప్పారు.. ఈ పుస్తకంలో సంస్కరణ పేరుతో ఎన్ని ప్రభుత్వ సంస్థలను మూసేశాడో వివరించారని వ్యాఖ్యానించారు.. ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్న కంపెనీల జాబితా కూడా సిద్ధం చేసి ఉంచాడన్న ఆయన.. అసలు కమ్యూనిస్టు పార్టీలకు ఏమైంది? అని మండిపడ్డారు.. వాళ్ళు కూడా అర్జెంటుగా చంద్రబాబును ఎందుకు అధికారంలోకి తీసుకుని రావాలి అనుకుటున్నారు? అని విమర్శించారు. ఏపీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వపరం చేసిన నాయకుడు వైఎస్ జగన్ అని గుర్తు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.