Virat Kohli కోహ్లీ స్పీచ్ తో ఆర్సీబీ అమ్మాయిల్లో జోష్.. సానియాపై సెటైర్లు వేస్తున్న నెటిజన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళల ప్రీమియర్ లీగ్ లో వరుసగా ఐదు ఓటముల ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ స్మృతి మంధాన సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సీజన్ లో బోణీ కొట్టింది. ఈ మ్యాచ్ కు ముందు టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లీ మాట్లాడిన మాటలు.. ఆర్సీబీ అమ్మాయిలకు వెయ్యి ఏణుగుల బలాన్నిచ్చాయి. గెలుపోటముల సంగతి తర్వాత.. ముందైతే పోరాడండి.. అంటూ కోహ్లీ చెప్పిన మాటలు మంధాన అండ్ టీమ్ కు టానిక్ లా పనిచేశాయి. అయితే కోహ్లీ స్పీచ్ ఆర్సీబీ అమ్మాయిలకు కొత్త ఉత్తేజానివ్వగా.. ఫ్యాన్స్ మాత్రం ఆ జట్టు మోంటార్ గా నియమితురాలైన సానియా మీర్జాను నెట్టింట ఓ ఆట ఆడుకుంటున్నారు.
Also Read : Australia Couple Lottery: అదృష్టమంటే ఇది.. భార్య అలిగింది, 16 కోట్ల లాటరీ తగిలింది
Also Read
- Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్గా బాధ్యతలు!
- CWC27 Ticket Ballot: టికెట్ బ్యాలెట్ ప్రక్రియకు అనూహ్య స్పందన.. 142 దేశాల నుంచి 1.50 కోట్ల దరఖాస్తులు..
- Cheteshwar Pujara: భారత్లో కూడా క్రిస్ గేల్ ఉన్నాడు.. చతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు..
- ICC Awards: శుభ్మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
యూపీ వారియ్స్ తో మ్యాచ్ కు కొద్దిసేపు ముందు విరాట్ కోహ్లీ.. ఆర్సీబీ క్యాంప్ కు వెళ్లాడు. ఆస్ట్రేలియాతో రేపు( శుక్రవారం) జరుగబోయే తొలి వన్డేకు ముందు వాంఖేడ్ స్టేడియానికి కోహ్లీ వెళ్లాడు. అక్కడే ఉన్న ఆర్సీబీ ప్లేయర్స్ ను కలిశాడు. వారిని ఓదార్చుతూరు ఆటగాళ్లలో స్పూర్తినిచ్చే విధంగా స్పీచ్ ఇచ్చాడు. కోహ్లీ మాట్లాడుతూ తాను 15 ఏండ్లుగా ఆడుతున్నాను.. ఇప్పటిదాకా మేం ఐపీఎల్ లో ట్రోఫీ గెలవలేదు.. అయినా కూడా అది తనను ఆపలేదు.. ప్రతి ఏడాది ఉత్సాహంతో బరిలోకి దిగుతుంటా.. ప్రతి మ్యాచ్, ప్రతి టోర్నీలో శాయశక్తులా శ్రమిస్తా.. ఒకవేళ నేను గెలిస్తే చాలా గ్రేట్.. కానీ అలా జరుగలేదు.. అయినా సరే అవకాశాల కోసం ఎదురుచూస్తునే ఉంటానని కోహ్లీ అన్నారు.
Also Read : Aadhar Card : ఆధార్ కార్డు ఉందా.. అయితే మీకో గుడ్ న్యూస్
ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకూ ఒక్క ట్రోఫీ నెగ్గకున్నా మనకు ప్రపంచంలో ఓ జట్టుకూ లేని అభిమానగణం ఉన్నారని విరాట్ కోహ్లీ అన్నారు. అత్యుత్తమ అభిమానుల మద్దతు ఉన్న జట్టు ఏదైనా ఉందంటే అది మన ఆర్సీబీ మాత్రమే అని కోహ్లీ చెప్పుకొచ్చారు. ప్లే ఆఫ్ కు వెళ్లేందుకు మీకు అవకాశాలు ఒక్కశాతం మాత్రమే ఉన్నాయి.. కానీ ఆ ఛాన్స్ కూడా చాలా కీలకం.. వాటిని మెరుగుపరుచుకోవాలని కోహ్లీ వెల్లడించారు. కోహ్లీ మాటలు ఆర్సీబీ అమ్మాయిల్లో స్పూర్తినింపాయి. గత ఐదు మ్యాచ్ లలో లేని విధంగా యూపీ వారియర్స్ తో బెంగళూరు టీమ్ అన్ని విభాగాల్లోనూ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. కాగా కోహ్లీ స్పీచ్ నెట్టిట వైరల్ కావడంతో ఆర్సీబీ అభిమానులు ఆ జట్టు మెంటార్ సానియా మీర్జాను ట్రోల్ చేస్తున్నారు.
Also Read : SRH : మారిన ఆరెంజ్ ఆర్మీ డ్రెస్.. మరి ఫేట్ మారేనా..?
జట్టుకు మెంటార్ గా చేయడమంటే డగౌట్ లో కూర్చుని ఇంటర్య్వూలు ఇవ్వడం కాదని.. జట్టులో స్పూర్తి నింపాలని కామెంట్స్ చేస్తున్నారు. టెన్నిస్ ఆడే వ్యక్తిని తీసుకొచ్చి క్రికెటర్లకు మెంటార్ గా నియమించడం ఆర్సీబీ చేసిన బుద్ది తక్కువ పని అంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. 20 రోజులుగా మెంటార్ గా ఉండి సానియా మిర్జా టీమ్ కు ఒక్క విజయాన్ని కూడా అందివ్వలేకపోయిందని.. కోహ్లీ ఒక్క స్పీచ్ తో అదరగొట్టాడని కామెంట్స్ చేస్తున్నారు. ఆర్సీబీకి రియల్ మెంటార్ అంటే విరాట్ కోహ్లీ అని టెన్నిస్ ప్లేయర్ కాదని ట్రోల్ చేస్తున్నారు.
- Tags
- cricket
- ipl
- RCB
- Sania Mirza
- VIRAT KOHLI
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!