ఆరెంజ్ ఆర్మీ సన్ రైజర్స్ హైదరాబా్ జట్టు ఐపీఎల్ సీజన్ లో కొత్త జెర్సీతో బరిలోకి దిగబోతుంది. ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ కోసం సన్ రైజర్స్ కొత్త జెర్సీని లాంఛ్ చేసింది. ఈ విషయాన్ని ఆ ఫ్రాఛైంజీ తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్ లో వెల్లడించింది. ఈ కొత్త జెర్సీల్లో ఎస్ఆర్హెచ్ జట్టు ఆటగాళ్లు ఉమ్రాన్ మాలిక్, మయాంక్ అగర్వాల్, వాషింగ్టన్ సుందర్ అదిరిపోయే లుక్ లో కనిపించారు.. ఈ కొత్త జెర్సీల ఫొటోలను పోస్ట్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్.. ఇది ఆరెంజ్ ఫైర్ త్వరలోనే మీ ముందుకు వస్తుందంటు తెలిపారు. ఈ కొత్త జెర్సీలో ఆడే మ్యాచ్ లను చూడటానికి టికెట్లను ఇప్పుడే కొనులోగు చేయండి అంటూ ఎస్ఆర్ హెచ్ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.
Also Read : Somu Veerraju: అంకెల గారడీతో మాయ చేశారు.. అప్పులను ఆదాయంగా చూపారు..!
పాత డ్రెస్ ని మార్పులు చేయకుండా.. కాషాయానికి ఇంకాస్తా నల్లరంగును అద్ది.. కొత్త డ్రెస్ ను రిలీజ్ చేసినట్లుంది. అలాగే ఆరెంజ్ కలర్లో ఉన్న ట్రాక్ ప్యాంట్ కలర్ ను పూర్తి బ్లాక్ కలర్ గా మార్చింది. మొత్తంగా ఈ ఆరెంజ్ ఆర్మీ కొత్త జెర్సీని చూస్తుంటే.. సౌతాఫ్రికా తొలి టీ20 లీగ్ లో ట్రోఫీని ముద్దాడిన సన్ రైజర్స్ ఈస్టర్ కేప్ జెర్సీలా కనిపిస్తుంది. ఇక పోతే మార్చ్ 31 నుంచి ప్రారంభమయ్య ఐపీఎల్ 16వ సీజన్ కోసం అందరు ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 2న సన్ రైజర్స్ జట్టు తమ తొలి మ్యాచ్ ను ఆడనుంది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్ నేషనల్ స్టేడియంలో జరగనుంది.
Also Read : Army Helicoptor Crash : కూలిన ఆర్మీ హెలీకాప్టర్.. లెఫ్టినెంట్ కల్నల్ మృతి
గత సీజన్ లో14 మ్యాచ్ లు ఆడిన సన్ రైజర్స్ జట్టు కేవలం ఆరింటిలో మాత్రమే గెలిచి.. ఎనిమిది మ్యాచుల్లో ఓడిపోయింద. అలా పాయింట్ల పట్టికలో 8వ స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో ఈ సారి ఎలాగైనా గెలవాలని.. మంచి పోటీనివ్వాలని సన్ రైజర్స్ టీమ్ ఆరాటపడుతుంది. గత సీజన్ లో కెప్టెన్ గా ఉన్న విలియమ్సన్ ను ఎస్ఆర్ హెచ్ ఫ్రాంఛైజీ వదులుకుంది. ఈ సారి కొత్త కెప్టెన్ ఏడెన్ మార్క్రమ్ కెప్టెన్సీలో బరిలోకి దిగనుంది. ఇతడే సౌతాఫ్రికా లీగ్ లో సన్ రైజర్స్ కు చెందిన ఈస్టర్ కేప్ ను విజేతగా నిలిపాడు. అలా కొత్త కెప్టెన్ కొత్త జెర్సీతో తన అదృష్టాన్ని సన్ రైజర్స్ జట్టు పరీక్షించుకోనుంది. ఇందులో భాగంగానే ఇటీవలే జరిగిన వేలంగా మయాంక్ అగర్వాల్, ఇంగ్లాండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ లాంటి వాళ్లను కొనుగోలు చేసింది. అలాగే వేలం ప్రారంభానికి ముందు బ్రియాన్ లారాను హెచ్ కోచ్ గా ఎంపిక చేసింది. దీంతో జట్టు మరింత బలపడింది. కానీ జట్టు తలరాత మారుతుందా లేదా అనేది చూడాలి..