Main Wapas Aaunga OTT: ఓటీటీలో నంబర్ వన్‌గా దూసుకెళ్తున్న పాకిస్తానీ లవ్ స్టోరీ.. ఐయండిబిలో 8.2 రేటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Main Wapas Aaunga OTT: దేశ విభజన నేపథ్యంలో తెరకెక్కిన ఓ పాకిస్తానీ ప్రేమ కథ ఓటీటీ ఆడియన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. థియేటర్లలో హిట్ టాక్ తో దూసుకుపోయిన ఈ మూవీ డిజిటల్ గానూ సత్తా చాటుతోంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన వెంటనే ట్రెండింగ్‌లో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. అసలు ఈ సినిమా ఏంటి? దేశ విభజన నేపథ్యంలో తెరకెక్కిన ఈ ప్రేమకథ ప్రేక్షకులను ఇంతగా ఎందుకు ఆకట్టుకుంటోంది? అనే విషయాలను తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్ లో ట్రెండింగ్
ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన ‘మెయిన్ వాపస్ ఆవుంగా’ (Main Wapas Aaunga) కి ప్రస్తుతం ఓటీటీ ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. శర్వరీ వాఘ్, వేదాంగ్ రైనా, నసీరుద్దీన్ షా, దిల్జిత్ దోసాంజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం దాదాపు 2 గంటల 47 నిమిషాల నిడివితో సాగుతుంది. ప్రేమ, దేశ విభజన, విడిపోవడం వంటి ఎమోషన్స్ తో తెరకెక్కించిన ఈ సినిమాకు ఐయండిబిలో 8.2 రేటింగ్ లభించింది. మొదట థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అనంతరం ఆగస్టు 7న నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్కు వచ్చింది. ఓటీటీలో విడుదలైన వెంటనే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో ట్రెండింగ్ జాబితాలో నంబర్ వన్ స్థానానికి చేరుకుంది. దీంతో థియేటర్లలో ఇప్పటికే చూసిన ప్రేక్షకులతో పాటు ఓటీటీ ఆడియన్స్ కూడా ఈ మూవీని వదలకుండా చూస్తున్నారు.
Also Read
- Ahaan Panday: 10 కథలు రిజక్ట్ చేసిన యువ హీరో.. చివరకు ఆ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్!
- Sai Pallavi: డైరెక్టర్ ఇన్పుట్స్ కాదు.. సీతమ్మ ఆశీర్వాదమే ముఖ్యం
- Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ టికెట్ రేట్ల పెంపునకు ఏపీలో గ్రీన్ సిగ్నల్..
- Keerthy Suresh: షూటింగ్లో నన్ను భయపెట్టారు.. తోటి నటులపై కీర్తి సురేష్ సంచలన కామెంట్స్!
కథలోకి వెళ్తే..
ఈ కథ 1947కు ముందు, ఆ తర్వాతి కాలాన్ని కలుపుతూ సాగుతుంది. ప్రస్తుతం 95 ఏళ్ల వయసున్న ఈషర్ సింగ్ (నసీరుద్దీన్ షా) అనే ముసలాయన చావు బతుకుల్లో ఉంటాడు. ఆయనకు మతిమరుపు జబ్బు ఉన్నా, పాకిస్తాన్లో తాను వదిలేసిన తన ప్రేయసిని కలవాలని, అక్కడికి వెళ్లాలని పదే పదే కలవరిస్తూ ఉంటాడు. అతని మనవడు నిర్వైర్ (దిల్జిత్ దోసాంజ్) తన తాతయ్య చివరి కోరికను నెరవేర్చడం కోసం ఆయన పాత జ్ఞాపకాలను వెతకడం మొదలుపెడతాడు. దాంతో కథ 78 ఏళ్ల క్రితం నాటి పంజాబ్‌కు వెళ్తుంది. అక్కడ యంగ్ ఈషర్ (వేదంగ్ రైనా), అఫ్సానా (శార్వరి వాగ్) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఎప్పటికైనా నేను మళ్లీ తిరిగి వస్తాను (మెయిన్ వాపస్ ఆవుంగా) అని ఆమెకు మాట ఇస్తాడు, కానీ దేశ విభజన గొడవల వల్ల ఇద్దరూ విడిపోతారు. చివరికి మనవడు పాకిస్తాన్ వెళ్లి ఆ అమ్మాయి వివరాలు కనుక్కోగా, ఆమె తన తాతయ్య ఇచ్చిన మాట కోసం జీవితాంతం ఎదురుచూసి పదేళ్ల క్రితమే చనిపోయిందని తెలుస్తుంది. అప్పుడు మనవడు ఆ అమ్మాయి ఫోటోను తాతయ్యకు చూపించి, ఆయన భ్రమలోనే ఆమెను కలిసినట్లు చేసి ప్రశాంతంగా కన్నుమూసేలా చేస్తాడు. దేశ విభజన వల్ల ఎంతోమంది జీవితాలు ఎలా ముక్కలయ్యాయో ఈ సినిమాలో చాలా ఎమోషనల్‌గా చూపించారు. ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
మొత్తంగా ‘మెయిన్ వాపస్ ఆవుంగా’ ఒక ప్రేమకథగా మొదలై, విభజనతో విడిపోయిన ఇద్దరి జీవితాలను చూపిస్తూ భావోద్వేగ ప్రయాణంగా మారుతుంది. థియేటర్లలో విజయం తర్వాత ఓటీటీలోనూ అదే ప్రభావాన్ని కొనసాగిస్తూ నెట్‌ఫ్లిక్స్‌లో అగ్రస్థానానికి చేరుకోవడంతో ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రేమకథలతో పాటు చారిత్రక నేపథ్యాన్ని ఆస్వాదించే వారికి ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో బెస్ట్ సజెషన్ గా నిలుస్తోంది.
- Tags
- netflix
తాజావార్తలు
-
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!
-
Government Jobs Rules: ప్రభుత్వ ఉద్యోగార్థులకు బిగ్ అలర్ట్.. ఈ చిన్న తప్పులు చేస్తే లైఫ్ లాంగ్ బ్యాన్ కావడం ఖాయం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీని ఆడించొద్దు.. టీమిండియా మేనేజ్మెంట్ ఆలోచించాలి!
-
Hyderabad: రాజేంద్రనగర్ పరిధిలో భారీ పేలుడు శబ్దం.. ఇళ్లపైకి పరుగులు తీసిన ప్రజలు.. అసలు ఏం జరిగింది?
-
AP Local Body Elections: నంద్యాలలో కలకలం.. సీపీఐ నేతల కిడ్నాప్‌కు టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి యత్నం!
ట్రెండింగ్
-
OLED డిస్ప్లే, iPadOS 27 ఆపరేటింగ్ సిస్టమ్, A20 Pro చిప్సెట్తో Apple iPad mini (2026) విడుదల..!
-
11,000mAh భారీ బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో HONOR X9e Pro విడుదల..!
-
Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..