Australia Couple Lottery: అదృష్టమంటే ఇది.. భార్య అలిగింది, 16 కోట్ల లాటరీ తగిలింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Australia Couple Won 16crs Of Lottery: ఆస్ట్రేలియాకు చెందిన ఒక జంటను అదృష్టం వరించింది. 30 సంవత్సరాల నుంచి ఆ జంట చేస్తున్న ప్రయత్నం ఎట్టకేలకు ఫలించింది. దీంతో వాళ్లు రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు. అలిగిన భార్యను సంతోష పెట్టడం కోసం భర్త రెండు లాటరీలు కొనగా.. ఆ రెండూ ఒకేసారి గెలవడంతో కోట్లకు పడగలెత్తారు. మార్చి 13వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. న్యూ సౌత్ వేల్స్‌కు చెందిన ఓ జంట గత 30 ఏళ్లుగా ఒకే నంబర్‌పై టికెట్ కొంటూ వస్తోంది. ఏదో ఒక రోజు అదృష్టం తమ తలుపు తట్టకపోదా.. అని ఆశించినప్పుడల్లా వారికి నిరాశే ఎదురైంది. అయితే.. ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత వారి ప్రయత్నం ఫలించింది. ఒకేసారి రెండు లాటరీలు తగలడంతో.. 2 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో రూ.16 కోట్ల 48 లక్షలు)ను వాళ్లు గెలుచుకున్నారు.
Man Hits Daughter In Law: ఉద్యోగం చేస్తానన్న పాపానికి.. ఇటుకతో కోడలిపై మామ దాడి
Also Read
- Nepal PM Balendra Shah: భారత్‌కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
- Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 28 మంది విద్యార్థులు, టీచర్ మృతి
- US News: 19 ఏళ్ల యువకుడికి "హిందుత్వం"పై ఇంత ద్వేషమెందుకు?
- Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
ఈ అనుభవం గురించి సదరు వ్యక్తి పంచుకుంటూ.. ‘‘మాకు లాటరీ తగులుతుందన్న నమ్మకంతో గత 30 సంవత్సరాల నుంచి లాటరీ టికెట్ కొనుగోలు చేస్తున్నాం. గత వారం నా భర్య నెంబర్‌పై లాటరీ తీసుకోవడం మర్చిపోవడంతో.. తను బాధగా ఫీల్ అయ్యింది. దీంతో.. ఆమెను సంతోషపరచడం కోసం ఆమె పేరు మీదే రెండు లాటరీలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. సోమవారం ఉదయం నెంబర్ పరీక్షించగా.. మొదటి టికెట్‌పై ఒక మిలియన్ డాలర్లు(రూ. 8 కోట్లు)గెలుచుకున్నట్లు తెలిసింది. వెంటనే రెండో టికెట్ కూడా విన్ అయినట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని నా భార్యకు చెప్పగా.. తను ఆనందంతో ఎగిరి గంతేసింది’’ అంటూ చెప్పుకొచ్చారు. తమకొచ్చిన డబ్బులతో కూతురిని కొత్త ఇల్లు కొనిస్తానని.. తమ పిల్లల భవిష్యత్తుతో పాటు వారి పిల్లల భవిష్యత్తు కోసం కూడా ఈ డబ్బుని ఉపయోగించనున్నట్టు పేర్కొన్నారు.
Somu Veerraju: అంకెల గారడీతో మాయ చేశారు.. అప్పులను ఆదాయంగా చూపారు..!
తాజావార్తలు
-
Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
-
PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
-
Isha Ambani: జియో పుట్టుక వెనుక అసలు కథ.. ఈషా అంబానీ చెప్పిన సీక్రెట్ స్టోరీ!
-
EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
-
Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!