Ravichandran Ashwin: 34 ఏళ్ల రికార్డు బద్దలుకొట్టి.. చరిత్ర సృష్టించిన అశ్విన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravichandran Ashwin Breaks 34 Years Old Record: టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చరిత్ర సృష్టించాడు. 34 ఏళ్ల క్రితం నమోదైన అరుదైన రికార్డ్‌ని బద్దలుకొట్టి.. వరల్డ్ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో భాగంగా అతడు ఈ ఘనతని సాధించాడు. 74 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి భారత్ పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు.. శ్రేయస్ అయ్యర్‌తో కలిసి అశ్విన్ (42 నాటౌట్) భారత ఇన్నింగ్స్‌ని ముందుకు సాగించాడు. చివరి వరకు అజేయంగా నిలిచి, జట్టుకి విజయాన్ని అందించాడు. ఇలా కీలక ఇన్నింగ్స్ ఆడిన అతడు, తన పేరిట ఓ వరల్డ్ రికార్డ్‌ని నమోదు చేసుకున్నాడు.
MLAs Bribe Case: ఎమ్మెల్యేల ఎర కేసులో హైకోర్టు ట్విస్ట్.. అందుకు గ్రీన్ సిగ్నల్
Also Read
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
టెస్ట్ క్రికెట్‌లో విజయవంతమైన ఛేజింగ్‌లో.. తొమ్మిది లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి, అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డ్ వెస్టిండీస్ ఆటగాడు విన్స్‌టన్ బెంజమిన్ పేరిట ఉండేది. 1988లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు 40 పరుగులు చేసి, నాటౌట్‌గా నిలిచి, తన జట్టుని గెలిపించుకున్నాడు. ఇప్పుడు 34 ఏళ్ల తర్వాత్ ఆ రికార్డ్‌ని అశ్విన్ బద్దలుకొట్టాడు. కేవలం బ్యాట్‌తో పరుగుల వర్షం కురిపించడమే కాదు, బంతితోనూ అశ్విన్ సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. ఇలా బ్యాట్ & బాల్‌తో అశ్విన్ రప్ఫాడించడంతో.. అతనికి మ్యాన్ ఆఫ్ ద అవార్డ్ దక్కింది.
Kushi Re Release Trailer: నటించకు.. నువ్వు నా నడుము చూసావ్..
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ కేవలం 145 స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగింది. ఇది చాలా తక్కువ లక్ష్యం కావడంతో.. సునాయాసంగా మ్యాచ్‌ని భారతీయులు ముగిస్తారని అనుకున్నారు. కానీ.. టాపార్డర్ చేతులెత్తేయడంతో భారత కష్టాల్లో మునిగిపోయింది. అక్షర్ పటేల్ (34) ఊపిరి పోయగా.. చివర్లో అయ్యర్ (29), అశ్విన్ ఆదుకొని జట్టుని గెలిపించారు. వీరి పుణ్యమా అని.. భారత్ మూడు వికెట్ల తేడాతో ఈ మ్యాచ్ గెలిచింది. ఫలితంగా.. 2-0 తేడాతో ఈ టెస్ట్ సిరీస్‌తో భారత్ క్లీన్ స్వీప్ చేసింది.
Omicron BF7 : మాస్క్ పెట్టాల్సిందే.. శానిటైజర్ పూసుకోవాల్సిందే.. ప్రజలకు సీఎం వార్నింగ్
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?