Kushi Re Release Trailer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ గురించి చెప్పాలంటే ఖుషి ముందు ఖుషి తరువాత అని చెప్పాలి. ఆయనకు ఉన్న ఫ్యాన్స్ భక్తులుగా మారడానికి కారణం ఆ సినిమా అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఖుషిలో పవన్ నటన, హావభావాలు, ఎమోషన్స్ ఒకటేమిటి టాలీవుడ్ లో పవన్ ను టాప్ హీరోగా నిలబెట్టిన సినిమా ఖుషి. ఎస్ జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే పవన్ తమ్ముడు, జల్సా సినిమాలురీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పించాయి. ఇక తాజాగా ఖుషి వంతు. డిసెంబర్ 31 న ఈ సినిమా అభిమానుల ముందుకు రానుంది. దీంతో అప్పుడెప్పుడో రిలీజ్ అయిన ట్రైలర్ ను మరోసారి అభిమానుల కోసం రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ గా మారింది.
సిద్దు సిద్దార్థ రాయ్ అంటూ పవన్ డైలాగ్స్.. ఏమే రాజహా అంటూ దేశభక్తిని తెలిపే గీతంతో సహా ట్రైలర్ లో అన్ని పొందుపరిచారు. ఇక ఖుషి అంటే గురొచ్చే నడుము సీన్ అయితే ఎప్పటికి హైలైటే.. నువ్వు నా నడుము చూసావ్ సిద్దు అని భూమిక అనగా.. లేదు.. నేను చూడలేదు అని పవన్ అమాయకమైన హావభావాలు అద్భుతం.. ఇక ఆలీ, పవన్ కామెడీ గురించి అసలు చెప్పనక్కర్లేదు. మణిశర్మ మ్యూజిక్, ఖుషి సాంగ్స్ ను ఎప్పటికీ మర్చిపోలేరు.. ఇక చివర్లో పవన్ ఐకానిక్ డైలాగ్.. నువ్వు గుడంబా సత్తిగారు కావొచ్చు.. తొక్కలో సత్తిగారు కావచ్చు.. బట్ ఐ డోంట్ కేర్.. బికాజ్ ఐయామ్ సిద్దు.. సిద్దార్థ రాయ్.. అంటూ ట్రైలర్ ను ముగించిన విధానం ఆకట్టుకొంటుంది. ఇక ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా రిలీజ్ రోజున ఫ్యాన్స్ చేసే హహంగామా ఎలా ఉండనుందో చూడాలి.