T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో అనూహ్యంగా సెమీస్ బెర్త్ పొందిన పాకిస్థాన్ ఇప్పుడు ఏకంగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం సిడ్నీ వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 7 వికెట్ల తేడాతో పాకిస్థాన్ ఘన విజయం సాధించింది. 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. మరో 5 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సొంతం చేసుకుంది. కెప్టెన్ బాబర్ ఆజమ్ 42 బంతుల్లో 53 పరుగులు…