నితిన్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘తమ్ముడు’. ‘వకీల్ సాబ్’ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అక్కా తమ్ముడు సెంటిమెంట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో సీనియర్ నటి లయ కీలక పాత్రలో నటిస్తూ రీ ఎంట్రీ ఇస్తున్నారు. సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా కనిపించనున్న ఈ సినిమా షూటింగ్ చాలా కాలం క్రితమే పూర్తయింది. ఫైనల్లీ ఈ సినిమా ఈ చిత్రం జులై 4న థియేటర్లలోకి రాబోతోంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది.
Also Read:Operation Sankalp: MAAతో కలిసి తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ‘ఆపరేషన్ సంకల్ప్’
‘మీ అక్కను చూశావా?. తను చనిపోవడానికి రెడీగా ఉంది కానీ, క్యారక్టర్ ను మాత్రం లూజ్ అవ్వలేదు’ అనే డైలాగ్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉందనే చెప్పాలి. ”చేసిన తప్పు వల్ల ఆవిడ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఆ మాట నిలబెట్టే ఛాన్స్ వచ్చింది” అంటూ నితిన్ చెప్పడాన్ని బట్టి చూస్తుంటే, తన అక్క మాటని నిలబెట్టే తమ్ముడి కథగా ఈ సినిమా ఉండబోతుందని అర్ధమవుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.