AP Rain Alert : మరో 3 రోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత దేశంలో నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చేసాయి.. గత కొద్ది రోజులు తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు ప్రతాపాన్ని చూపిస్తుంది.. పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.. దాంతో జనాలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు..ఉక్కపోత తో అల్లాడిపోయిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీపికబురు. ఏపీతో పాటు తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. అటు విదర్భలోని కొన్ని భాగాలు, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని మిగిలిన ప్రదేశాలు.. జార్ఖండ్, బీహార్‌లోని మరికొన్ని భాగాలు, తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు కూడా రుతుపవనాలు విస్తరించాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు..
రాబోయే మరో మూడు రోజులు ఏపీ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.. ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురుగాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో వీస్తాయి.. అదే విధంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు..
Also Read
ఇక రేపు ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుముల తో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురుగాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతోవీస్తాయని అంటున్నారు..
ఎల్లుండి..ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు..
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!