ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పెద్ద వయస్సు ఉన్న కెప్టెన్ గా ఎంఎస్ ధోని నిలిచాడు. ఐపీఎల్ 2023లో భాగంగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా బరిలోకి దిగిన ధోని ఈ అరుదైన రికార్డును సాధించాడు. ధోని 41సంవత్సరాల 267 రోజుల వయస్సులో ఈ ఘనత నమోదు చేశాడు.