IPL2024: ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న నైట్ లక్నో సూపర్ జెయింట్స్- పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో లక్నో 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 199 పరుగులు చేసి పంజాబ్ ముందు 200 పరుగుల టార్గెట్ ను ఉంచారు. ఈ క్రమంలో లక్ష్యచేధనలో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది.ఓపెనర్లు శిఖర్ ధావన్ (70), బెయిర్ స్టో (42) పరుగులతో రాణించారు. ఒకానొక దశలో 100 పరుగులు చేసినా.. వికెట్ నష్టపోలేదు.దీనితో ఫాన్స్ అందరూ విజయం పంజాబ్ దే అనుకున్నారు.
Also Read; IPL 2024 Dc vs CSk: చెన్నై వరుస విజయాలకు ఢిల్లీ బ్రేకులు వేయగలదా..?!
కానీ అప్పుడు మొదలయింది అసలు మ్యాచ్, లక్నో బౌలర్ మయాంక్ యాదవ్(3 వికెట్స్ ) దెబ్బకు పంజాబ్ కింగ్స్ ఒక్కసారిగా పడిపోయింది. న్యూఢిల్లీ లో పుట్టి పెరిగిన ఈ 21 సంవత్సరముల కుర్రోడు డెబ్యూ మ్యాచ్ లోనే పంజాబ్ బేటర్స్ ని తన మెరుపు బౌలింగ్ తో ఇన్నింగ్స్ ని కట్టడి చేసాడు. అంతే కాకుండా ఐపీల్ 2024 లో ఫాస్టెస్ట్ డెలివర్(155.8kmph )గా నమోదు చేసాడు ఈ యంగ్ డైనమిక్ బౌలర్. మరోవైపు లక్నో బౌలింగ్ లో మోషిన్ ఖాన్ కూడా రెండు కీలక వికెట్లు తీయడంతో మ్యాచ్ లక్నో వైపు తిరిగింది. ఏది ఏమైనా సరే ఇండియా కి ఒక మంచి ఫాస్ట్ బౌలర్ దొరకదని చెప్పడం లో సందేహం లేదు అని చెప్పవచ్చు.