ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 13వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడేందుకు చెన్నై సూపర్ కింగ్స్ వైజాగ్ లోని ACA-VDCA స్టేడియానికి వెళ్లనున్నాయి ఇరు జట్లు. ఇక మార్చి 31, ఆదివారం రాత్రి 07:30 కు జరిగే ఈ మ్యాచ్ కు ముందు., చెన్నై, ఢిల్లీ జట్లు మొత్తం 29 మ్యాచ్ లలో తలపడగా.. అందులో 10 మాత్రమే క్యాపిటల్స్ గెలిచింది. మిగితా 19 మ్యాచ్ లలో సూపర్ కింగ్స్ విజయం సాధించింది.
Also read: Sreeleela : ప్రముఖ విద్యాసంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా శ్రీలీలా..!
ఇక వైజాగ్ లోని ఎసిఎ-విడిసిఎ స్టేడియంలోని పిచ్ ఐపిఎల్‌లో ఇప్పటివరకు 13 మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వగా.. ఆ మ్యాచ్‌లలో మొదటి, రెండవ స్థానంలో బ్యాటింగ్ చేసిన రికార్డులు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు ఆరుసార్లు గెలుపొందగా, రెండో బ్యాటింగ్ చేసిన జట్టు ఏడుసార్లు గెలిచింది. గతంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి పాయింట్లను సాధించాలంటే ఈ మ్యాచ్ లో తప్పక గెలవాలి. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ ను ఆత్మవిశ్వాసంతో ప్రారంభించి 2 విజయలతో దూసుకెళ్తోంది.
Also read: KCR: నేడు కేసీఆర్ జిల్లాల పర్యటన.. సూర్యాపేటలో మీడియా సమావేశం..
ఇక జట్ల ఆటగాళ్ల వివరాలను చూస్తే.. ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టు లో రిషబ్ పంత్ (c/wk), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రికీ భుయ్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, అభిషేక్ పోరెల్ (ఇంపాక్ట్ ప్లేయర్) గా ఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు లో రుతురాజ్ గైక్వాడ్ (సి), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోని (వికెట్లు), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహమాన్, మతీషా పతిరణ (ఇంపాక్ట్ ప్లేయర్) గా ఉండబోతున్నారు.