యూఏఈలో నిన్న జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఓడిపోయిన విషయం తెలిసందే. ఈ టోర్నీలో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 172 పరుగులు చేసిన.. దానిని కాపాడుకోలేకపోయింది. ఈ మ్యాచ్ లో కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 85 పరుగులు చేసాడు. ఇక ఈ మ్యాచ్ అనంతరం విలియమ్సన్ తన జట్టు ఓటమి గురించి మాట్లాడుతూ.. షేమ్ అని అన్నాడు. ఇందులో ఓడిపోవడం మాకు చేయలేకపోవడం సిగ్గుచేటు అని చెప్పాడు. దీనికి మా జట్టు నష్టాన్ని అనుభవిస్తుంది పేర్కొన్నాడు. అయితే ఈ మ్యాచ్ లో క్రెడిట్ మొత్తం ఆసీస్ జట్టుకే పోతుంది అన్నాడు. వారు లక్షయని ఛేజ్ చేసిన విధానాన్ని కేన్ ప్రశంసించాడు. ఇక 2015, 2019 ప్రపంచ కప్ లలో ఇలాగే ఫైనల్ వరకు వచ్చిన కివీస్ ఓడిపోయిన విషయం తెలిసిందే.