Aakash Chopra Tweet Goes Viral on Rohit Sharma: టీ20 ప్రపంచకప్ 2024 కోసం 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ మంగళవారం (ఏప్రిల్ 30) ప్రకటించింది. జట్టును ప్రకటించినప్పటి నుంచి సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. మాజీలు, ఫాన్స్ తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. అయితే భారత మాజీ బ్యాటర్ ఆకాష్ చోప్రా.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ప్రపంచకప్ జట్టు నుంచి తొలగించాలన్న వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. నిజానికి ఈ వ్యాఖ్యలు ఆకాష్ చేయలేదట.
‘భారత కెప్టెన్ రోహిత్ శర్మను టీ20 ప్రపంచకప్ 2024కు ఎంపిక చేయకూదు. అతను ఇప్పుడు పవర్‌ప్లేలో కూడా విఫలమవుతున్నాడు’ అని ఆకాష్ చోప్రా చెప్పినట్లు ఎక్స్‌లో ఓ యూసర్ ఒక పోస్ట్ పెట్టాడు. ఇది చూసిన ఆకాష్ చోప్రా అతడిపై మండిపడ్డాడు. నైతిక విలువల కంటే వ్యూస్ ముఖ్యమా అని ఫైర్ అయ్యాడు. ‘ద్వేషం, ఫేక్ న్యూస్ సహా అన్ని రకాల చెత్త వార్తలను వ్యాప్తి చేయడానికి ఐపీఎల్ మంచి సమయం. అభిమాన సంఘాలు ఎల్లప్పుడూ వార్తలను వ్యాప్తి చేయడానికి ముందుంటాయి. నైతిక విలువల కంటే వ్యూస్ ముఖ్యమా అని నేను ఒక్కోసారి ఆశ్చర్యపోతుంటా’ అని చోప్రా ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
Also Read: RCB vs GT: బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు.. తుది జట్లు ఇవే!
టీ20 ప్రపంచకప్‌లో 15 మందితో కూడిన భారత జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తాడు. ఒక సంవత్సరానికి పైగా టీ20లలో ఆడని రోహిత్.. ఈ ఏడాది ప్రారంభంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన సిరీస్ ద్వారా జట్టులోకి తిరిగి వచ్చాడు. 37 ఏళ్ల రోహిత్ ప్రస్తుతం ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ తరఫున 11 మ్యాచ్‌లలో 326 పరుగులు చేశాడు. ఈ సీజన్లో ముంబై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ చెలరేగిన విషయం తెలిసిందే. పొట్టి ప్రపంచకప్‌లో కూడా అతడు బాగా ఆడాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.