RCB vs GT Playing 11:ఐపీఎల్ 2024లో భాగంగా మరికొద్దిసేపట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ రాత్రి 7.30కు ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని ఫాఫ్ తెలిపాడు. మరోవైపు తాము రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు గుజరాత్ సారథి శుభ్‌మన్ గిల్ చెప్పాడు. మానవ్ సుతార్, జోష్ లిటిల్ జట్టులోకి వచ్చారు.
ఐపీఎల్ 2024లో బెంగళూరు, గుజరాత్ పేలవ ప్రదర్శన చేస్తున్నాయి. బెంగళూరు ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడి.. 3 విజయాలు, 7 ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. గుజరాత్ 10 మ్యాచ్‌లు ఆడి.. 4 విజయాలు, 6 ఓటములతో పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. బెంగళూరుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు లేకున్నా.. నాలుగు మ్యాచ్‌లలో గెలిస్తే గుజరాత్కు అవకాశం ఉంది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు బెంగళూరు, గుజరాత్ జట్లు నాలుగు సార్లు తలపడ్డాయి. ఇరు జట్లు చెరో రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి.
Also Read: MS Dhoni: ఎంఎస్ ధోనీ నాకు తండ్రి లాంటి వారు.. జూనియర్ మలింగ కామెంట్స్ వైరల్!
తుది జట్లు:
బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, దినేశ్ కార్తీక్, స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్, విజయ్ కుమార్ వైశాఖ్.
గుజరాత్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మానవ్ సుతార్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, జోష్ లిటిల్.