ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న ( గురువారం ) జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ సత్తా చాటాడు. ఆన్ ఫీల్డ్‌లో తన ప్రవర్తనతో పాపులరైన ఈ ప్లేయర్.. మైదానంలో తాను ఏమి సాధించినా డ్యాన్స్‌లు చేస్తూ.. విచిత్ర హావభావాలు పలికిస్తాడు. ఇక, తాజాగా అతను చేసిన కొన్ని స్టంట్స్ సోషల్ మీడియాలో మస్త్ పాపులర్ అయ్యాయి. దేశవాలీ టోర్నీలో సెంచరీ చేసిన తర్వాత నా స్థాయి ఇది కాదని సైగలు చేశాడు.. ఐపీఎల్‌లో హాఫ్ సెంచరీ అనంతరం డ్యాన్స్ చేయడం లాంటివి వాటితో జనాలకు బాగా కనెక్ట్ అయ్యాడు.
Read Also: Malothu Kavitha: నేను పార్టీ మారడం లేదు.. క్లారిటీ ఇచ్చిన మాలోత్ కవిత
ఇక, రియాన్ పరాగ్ ఢిల్లీపై మెరుపు ఇన్నింగ్స్ తో రాత్రికి రాత్రి రాజస్థాన్ ఫ్యాన్స్ హీరోలా చూడటం స్టార్ట్ చేశారు. గురువారం రోజు రాత్రి నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రియానే కనపడుతున్నాడు. ఇతనికి సంబంధించిన పాత వీడియోలు, ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో పాత వీడియో ఒకటి బాగా వైరల్ అవుతుంది. ఈ వీడియోలో రియాన్ డ్యాన్స్‌తో ఇరగదీస్తుంటే శుభ్‌మన్ గిల్ అతన్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఫాస్ట్ బీట్ ఉండే ఓ ట్యూన్‌కు రియాన్ ప్రొఫెషనల్ డ్యాన్సర్‌లా స్టెప్పులు వేశాడు. మొత్తానికి రియాన్ బ్యాట్‌తోనే కాకుండా డ్యాన్స్‌తోనూ రియాన్ పరాగ్ ఇరగదీశాడు. ఇదిలా ఉంటే, ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్‌లో రియాన్ (45 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 84 నాటౌట్) రెచ్చిపోవడంతో రాయల్స్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.
https://twitter.com/Classypratheep/status/1773382616189907403