Murder : కుటుంబ బాధ్యతలను పూర్తిగా విస్మరించి, మద్యం వ్యసనానికి బానిసైన ఓ భర్త తన భార్యను గొడ్డలితో నరికి హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా ఫరుక్‌నగర్ మండలం అయ్యవారిపల్లిలో చోటుచేసుకుంది. మద్యం కొరకు ప్రతిరోజూ భార్యను డబ్బుల కోసం వేధిస్తున్న భర్త, ఆమె డబ్బులు ఇవ్వకపోవడంతో అతి దారుణంగా చంపేశాడు. ఈ ఘటన గ్రామాన్ని షాక్‌కు గురి చేసింది. షాద్‌నగర్ పట్టణ సీఐ విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల పరుశురాములు తన భార్య జానమ్మతో తరచూ గొడవ పడేవాడు. సంసార బాధ్యతలు పట్టించుకోకుండా రోజంతా జులాయిగా తిరుగుతూ, మద్యం కోసం డబ్బులు అడిగేవాడు. అయితే, భార్య డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో అతడు అగ్రహంతో రాత్రి గొడ్డలితో ఆమెపై దాడి చేసి దారుణంగా హత్య చేశాడు.
పరుశురాములు పనికి వెళ్ళకుండా రోజంతా దొడ్డిదారిన తిరుగుతూ, మద్యం తాగడమే అలవాటుగా మార్చుకున్నాడు. గత కొంత కాలంగా అతను భార్యపై తీవ్రంగా ఒత్తిడి పెడుతూ, మద్యం కోసం డబ్బులు అడుగుతూ వేధించేవాడు. భార్య జానమ్మ నిరాకరించగానే, కోపంతో అర్ధరాత్రి ఆమెపై గొడ్డలితో దాడి చేసి ప్రాణాలు తీశాడు. ఈ సంఘటన తెలియగానే గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హత్య చేసిన భర్త పరుశురాములను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
ఈ ఘటన మద్యం కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్న దారుణ పరినామాలను మరోసారి ఆవిష్కరించింది. మద్యానికి బానిసైపోయి కుటుంబాన్ని పట్టించుకోకుండా పతనమవుతున్న మగువారి ఆలోచనలను ఈ ఘటన ప్రశ్నార్థకంగా మారుస్తోంది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వ చర్యలు, సమాజంలో అవగాహన పెంచే కార్యక్రమాలు అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ కేసు పై మరిన్ని వివరాలను పోలీసులు త్వరలో వెల్లడించనున్నట్లు సమాచారం.
Trump: ట్రంప్ మాస్ వార్నింగ్.. టెస్లా ఆస్తులపై దాడి చేస్తే 20 ఏళ్లు జైలు