హీరో హీరోయిన్‌లకు అభిమానులు ఉండటం సహజం. కానీ కొంత మంది వింత ఫ్యాన్స్ కూడా ఉంటారు. అదేంటి అనుకుంటున్నారా.. తాజాగా బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో రణ్ బీర్ చేపిన విషయం వింటే నిజమే అంటారు. మనకు తెలిసి సాదారణంగా అభిమానులు తమ ప్రేమను చాటేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. పూజలు చేస్తుంటారు.. హీరోల కోసం, హీరోయిన్‌ల కోసం కాలినడక వెళ్తుంటారు.. పచ్చబొట్లు పొడిపించుకుంటారు. ఇలా వెరైటీ రూపాల్లో తమ ప్రేమను చాటుకుంటారు. కానీ రణ్ బీర్ లేడీ ఫ్యాన్ మాత్రం ప్రేమను ఒక వింత పని చేసి చాటుకుంది.
Also Read: Gautam : యాక్టింగ్‌తో అదరగొట్టిన మహేశ్ కొడుకు గౌతమ్.. వీడియో వైరల్
బాలీవుడ్ రన్‌బీర్ కపూర్‌కు ఉన్న లేడి ఫాలోయింగ్ తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రన్ బీర్ గతంలో ఓ మహిళా అభిమాని చేసిన వింత పనిని పంచుకున్నాడు..‘ ఓ అమ్మాయి నన్ను బాగా అభిమానించేది. నేను ఒక రోజు ఊర్లో లేని సమయంలో ఆ అమ్మాయి పురోహితుడిని తీసుకొచ్చి నా ఇంటి గేట్‌ను పెళ్లి చేసుకుందట. గేట్కు పువ్వులు, బొట్టు కూడా పెట్టింది. నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత నా వాచ్మెన్ ఈ విషయం చెప్పాడు. అంతా ఆశ్చర్యానికి గురయ్యాం. ఆమె నా మొదటి భార్య. తనను ఇప్పటివరకు నేను కలవలేదు. ఆమెను కలిసే రోజు కోసం ఎదురుచూస్తున్నాను’ అని నవ్వుతూ చెప్పాడు.