Rishabh Pant: నా వల్లే ఓడిపోయాం.. కెప్టెన్ రిషబ్ పంత్ ఆవేదన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishabh Pant: నిన్న లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్(RR) జట్టు లక్నో సూపర్ జెయింట్స్(LSG)పై 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగా, లక్నో 18 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలిపోయింది. ఇక ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(43) రాణించాడు. మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ కైవసం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఘోర పరాజయం అనంతరం.. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తామ టీమ్ చెత్త బ్యాటింగ్ వల్లే ఓడిపోయామని స్పష్టం చేశాడు. జట్టు ఓటమికి ప్రధాన కారణం బ్యాటింగే అని పంత్ అంగీకరించాడు. తాను సైతం నిందించుకున్నాడు. తనతో పాటు బ్యాటర్లందరూ విఫలమయ్యారన్నాడు. బౌలర్లు గత మ్యాచ్ కంటే మెరుగ్గా రాణించి తమ పనిని చక్కగా పూర్తి చేశారని కొనియాడాడు. కానీ బ్యాటర్లే తమ బాధ్యతను నెరవేర్చలేకపోయారని అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఓటమికి కారణాలను బయట ఎక్కడో వెతకడం కంటే, జట్టు లోపలే వెతుక్కోవాలని పంత్ సూచించాడు. జట్టుగా అందరూ నిరాశలో ఉన్నప్పటికీ, పరిష్కార మార్గాలను కనుగొనడం ముఖ్యమని చెప్పాడు. బాల్ స్వింగ్ అవుతున్నప్పుడు క్రీజులో కొంచెం డీలే అవుతుందన్నాడు. బ్యాటింగ్ సమయంలో మేం కాస్త టైమ్ తీసుకొని ఆడాల్సిందని తెలిపాడు. ఈ విషయంలో తనతో సహా బ్యాటర్లందరూ బాధ్యత వహించాలని స్పష్టం చేశాడు. తమ జట్టులో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తగినంత సత్తా (firepower) ఉందని పంత్ ధీమా వ్యక్తం చేశాడు. జట్టుగా ఈ ఓటమి తమకు నిరాశ కలిగిస్తుందని.. కానీ తాము ఇంకా సానుకూల అంశాల వైపే చూడాలనుకుంటున్నామన్నాడు. తమ బలహీనతలను సరిదిద్దుకోవాలని.. బౌలింగ్, బ్యాటింగ్‌లో ఫైర్ పవర్ ఉందన్నాడు. తాము కచ్చితంగా పుంజుకుంటామని నమ్మకం వ్యక్తం చేశాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 159 పరుగులు చేసింది. ఇక 160 పరుగుల లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ రంగంలోకి దిగిన లక్నోకు ఆరంభంలోనే చెతికిలపడింది. తొలి ఓవర్లోనే ఆయుష్ బదోని రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన రిషబ్ పంత్ ఖాతా తెరవకుండానే అవుటయ్యాడు. అనంతరం ఐడెన్ మార్క్రమ్ సైతం ఖాతా తెరవడంలో విఫలమయ్యాడు. లక్నో టాప్-ఆర్డర్ బ్యాట్స్మెన్లలో ముగ్గురు డకౌట్ అయ్యారు. ఆ తర్వాత మిచెల్ మార్ష్ అర్ధశతకం సాధించాడు. అయితే, మార్ష్ సైతం అవుట్ అవ్వడంతో లక్నో జట్టు తీవ్రంగా తడబడింది. 119 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ ఓటమితో లక్నో పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి పడిపోయింది.
తాజావార్తలు
-
Hyderabad Traffic : హైదరాబాద్ ట్రాఫిక్‌కు అసలు విలన్ ఎవరు.?
-
UP: యూపీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పర్యటన.. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరుగుతాయా?
-
KRMB : కృష్ణా నీళ్లపై మళ్లీ పంచాయితీ.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
-
Dil Raju: ‘టాక్సిక్’పై దిల్ రాజు రూ.120 కోట్ల బిగ్ బెట్? ఇక అంతా యశ్‌పైనే!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!