AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- ప్రైవేట్ నుండి ప్రభుత్వ పాఠశాలల్లో లక్షకు పైగా విద్యార్థుల చేరిక..
- ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, అభ్యసన ఫలితాలపై దృష్టి సారించాలి..
- ప్రాథమికోన్నత పాఠశాలల్లో గరిష్ట సామర్థ్యానికి విద్యార్థుల ప్రవేశాలు..
- ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజుల నియంత్రణపై అధ్యయనం చేయండి..
- సెప్టెంబర్ 5 నుంచి 9,10 తరగతి విద్యార్థులకు ఏఐ ట్యూటర్ విధానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Government Schools:ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థుల హాజరు శాతం, అభ్యసన ఫలితాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలోని తన నివాసంలో పాఠశాల విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు. విద్యారంగంలో చేపట్టిన సంస్కరణల ఫలితంగా ఈ ఏడాది ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు 1.06 లక్షల మంది విద్యార్థులు కొత్తగా చేరినట్లు అధికారులు వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా 7,620 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉండగా, వాటిలో 3,515 పాఠశాలలు (46.13 శాతం) గరిష్ట సామర్థ్యానికి చేరుకున్నాయని అధికారులు వివరించారు. విద్యా ప్రమాణాల మెరుగుదలతో పాటు ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల విశ్వాసం పెరగడం వల్లే ఈ మార్పు సాధ్యమైందని పేర్కొన్నారు. అలాగే ఈ ఏడాది 159 పాఠశాలలు ఆదర్శ ప్రాథమిక పాఠశాలలుగా రూపాంతరం చెందాయని తెలిపారు.
Also Read
- AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
- Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
- AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
- Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
సమావేశంలో ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల నియంత్రణ అంశంపైనా చర్చ జరిగింది. ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేసి, రాష్ట్రానికి అనువైన విధానాన్ని రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో విద్యలో సాంకేతికత వినియోగాన్ని విస్తరించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వివరించారు. సెప్టెంబర్ 5 నుంచి తొలి దశలో 175 లీప్ పాఠశాలల్లో 9, 10 తరగతుల విద్యార్థులకు గణితం, సైన్స్ అంశాల్లో ఏఐ ట్యూటర్‌ను ప్రీ-పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో క్లిక్కర్స్ వ్యవస్థతో ఏఐ ట్యూటర్‌ను అనుసంధానించాలని లోకేష్ సూచించారు.
అదేవిధంగా ఐఈఆర్‌పీఎస్ రెగ్యులరైజేషన్, హైస్కూల్ ప్లస్‌లలో గెస్ట్ లెక్చరర్ల నియామకంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. మరోవైపు అమరావతిలో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, విశాఖపట్నంలో జిల్లా కేంద్ర గ్రంథాలయం, మంగళగిరిలో స్కిల్ ఎక్సలెన్స్ సెంటర్ నిర్మాణ ప్రతిపాదనలను మంత్రి పరిశీలించారు. వచ్చే నెలలో అమరావతిలో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
-
CM Chandrababu: కరువు సీమ.. సిరుల సీమగా మారుతుంది.. సీమ చరిత్రలో అక్టోబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోతుంది..
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!