Gossip : రేపే థియేటర్లలో ‘గాసిప్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో వైవిధ్యమైన కంటెంట్‌తో వచ్చే చిన్న సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. అదే కోవలో నేటి తరం ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే సరికొత్త ఎమోషన్స్, ఒక అందమైన ప్రేమకథను మేళవిస్తూ ప్రస్తుత సమాజంపై గట్టి సోషల్ సెటైర్‌గా వస్తోన్న చిత్రం “గాసిప్” (Gossip). మోస్ట్ టాలెంటెడ్ అండ్ ఎనర్జిటిక్ బ్యూటీ రాశి సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ రేపు (జూన్ 26న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధమైంది. వైభవ్ సినీ స్కల్ప్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై యతి (ఏతి రేమెళ్ల) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి వైభవ్ కౌండిన్య దర్శకత్వం వహించారు.
యూనిట్ ఇప్పటికే విడుదల చేసిన సాంగ్స్, టీజర్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకోగా.. ఇటీవలే రిలీజ్ అయిన పవర్ఫుల్ ట్రైలర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పీక్స్‌కు తీసుకెళ్లింది. ప్రస్తుత సమాజంలోని కొన్ని చేదు నిజాలను, మనుషుల మనస్తత్వాలను ప్రతిబింబించేలా ఈ ట్రైలర్ ఉందంటూ ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. రేపు గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా టికెట్ బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. సినిమా రిలీజ్ సందర్భంగా నిర్మాత యతి మాట్లాడుతూ.. తమ చిత్ర విడుదలకు ఎంతగానో సహకరిస్తున్న ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ ‘పివిఆర్ సినిమాస్’కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా సినిమాపై లవ్ చూపిస్తున్న ఆడియన్స్‌కు థాంక్స్ చెప్తూ.. కంటెంట్ నమ్మి తీసిన ఇలాంటి చిన్న సినిమాలను థియేటర్లకు వచ్చి ఆదరించాలని కోరారు.
Also Read
- Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
- Impure : పెళ్లి కూతురు 'కన్య' కాదని పెళ్లి క్యాన్సిల్.. టాలీవుడ్‌ను షేక్ చేసే బోల్డ్ కాన్సెప్ట్‌తో వస్తున్న 'ఇంప్యూర్'!
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
దర్శకుడు వైభవ్ కౌండిన్య మాట్లాడుతూ.. సినిమా కోసం రేయింబగళ్లు కష్టపడిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు థాంక్స్ చెప్పారు. తమ వెనుక నిలబడిన నిర్మాతకు, అలాగే థియేట్రికల్ విడుదలకు సపోర్ట్ ఇస్తున్న పివిఆర్ సినిమాస్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రేక్షకులందరికీ ఈ సోషల్ సెటైర్ కచ్చితంగా నచ్చుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!