ఈరోజు ఐపీఎల్ 2025 క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (MI), పంజాబ్ కింగ్స్ (PBKS) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం స్టేడియంలో వర్షం కురుస్తోంది. దీంతో మ్యాచ్ కాస్త ఆలస్యంగా ప్రారంభంకానుంది. ప్రస్తుతం పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు.
ఐపీఎల్ 2025 మ్యాచ్ నంబర్-34లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS)తో తలపడనుంది. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ టాస్ 7 గంటలకు జరగాల్సి ఉండగా.. వర్షం కారణంగా టాస్ లేట్ అవుతోంది. భారీ వర్షం కురవడంతో స్టేడియాన్ని కవర్లతో కప్పారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మ్యాచ్ నంబర్-28లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ (RR) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడనుంది. ఈ రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బెంగళూరు జట్టుకు రజత్ పటిదార్ నాయకత్వం వహిస్తుండగా.. రాజస్థాన్ కెప్టెన్‌గా సంజు శాంసన్ ఉన్నాడు.
ఐపీఎల్ 2025లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. గుజరాత్ నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. లక్నో జట్టు 6 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. లక్నోలోని ఎకానా స్టేడియంలో రెండు జట్లు ముఖాముఖి తలపడుతున్నాయి. కాగా.. టాస్ గెలిచిన రిషబ్ పంత్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. గుజరాత్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
RR vs KKR : ఐపీఎల్ 2025లో భాగంగా నేడు జరిగిన రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ అనుకున్నంత ఉత్కంఠ రేకెత్తించలేదు. మ్యాచ్ ప్రారంభంలో టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ టీం, క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ ఎదురుదెబ్బ తిన్నది. అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్ నుంచి పెద్ద స్కోర్ రావకపోవడం రాజస్థాన్ రాయల్స్‌ను దెబ్బతీసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 29 పరుగులతో తేలికపాటి…
ఐపీఎల్ పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ తొలి స్థానంలో ఉండగా.. పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. నాలుగు పాయింట్లతో 0.333 నెట్ రన్ రేట్‌తో రెండవ స్థానానికి ఎగబాకింది. ఆతిథ్య రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది మరియు వారు 1.675 నెట్ రన్ రేట్‌తో రెండు మ్యాచ్‌లలో ఒక విజయంతో నాల్గవ స్థానానికి పడిపోయింది.