Telugu-Tamil Bilingual Sabdham Teaser Launched: హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్ కలిసి ‘వైశాలి’తో సెన్సేషనల్ హిట్ కొట్టారు. ఇప్పుడు మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ సూపర్‌నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ ‘శబ్దం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. 7G ఫిల్మ్స్ శివ, ఆల్ఫా ఫ్రేమ్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తుండగా, ఎస్ భానుప్రియ శివ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసిన మేకర్స్ ఈ రోజు టీజర్‌ను రిలీజ్ చేశారు. విక్టరీ వెంకటేష్ టీజర్ లాంచ్ చేశారు. ఇక ఈ టీజర్‌లో సినిమాలో అదిరిపోయే సెటప్‌ని పరిచయం చేయడంతో పాటు ఉత్కంఠమైన అనుభూతిని అందిస్తున్నారు. హీరో ఆది పినిశెట్టి ఒక హాంటెడ్ హౌస్ వద్ద కొన్ని వింత సంఘటనలు జరిగేటప్పుడు కొన్ని విచిత్రమైన శబ్దాలను రికార్డ్ చేయడం వీడియోలో కనిపిస్తుంది. ఇక టీజర్‌లో సినిమాలోని ప్రముఖ నటీనటులందరినీ చూపించారు మేకర్స్. టీజర్ అంచనాలను పెంచేయగా ఆది పినిశెట్టి తన పాత్రలో అద్భుతంగా కనిపిస్తున్నాడు.
Casting Call: యాక్టింగ్ లో ఒక్క ఛాన్స్ అంటూ వెయిట్ చేస్తున్నారా… ఇది మీ కోసమే
ఇక దర్శకుడు అరివళగన్ ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో టీజర్ ని టెర్రిఫిక్ గా ప్రజెంట్ చేశారని చెప్పొచ్చు. అరుణ్ పద్మనాభన్ కెమెరా యాంగిల్స్ ఉత్కంఠతని క్రియేట్ చేసేలా ఉన్నాయి. ఇక సంగీత దర్శకుడు థమన్ ఎస్ తన అసాధారణమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ఫియర్ ఫ్యాక్టర్ ని పెంచారు. వైశాలిలో చాలా రైన్ బేస్డ్ సన్నివేశాలు ఉండగా, శబ్దం సినిమాలో చాలా సన్నివేశాలు పర్వతాలు, పర్యాటక ప్రదేశాలలో చిత్రీకరించబడ్డాయని అంటున్నారు. ముంబై, మున్నార్, చెన్నైలోని అనేక ప్రదేశాలలో ఈ సినిమా చిత్రీకరించారని, సినిమా కోసం 120 ఏళ్ల నాటి లైబ్రరీని నిర్మించారని మేకర్స్ వెల్లడించారు.. సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్, రెడిన్ కింగ్స్లీ, ఎం.ఎస్. భాస్కర్, రాజీవ్ మీనన్ కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాకి జాతీయ అవార్డు గ్రహీత సాబు జోసెఫ్ ఎడిటింగ్ చేస్తున్నారు. మనోజ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించిన ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.
Thanks a lott for launching our teaser venki sir ❤️ https://t.co/E8xtfH77AQ
— Aadhi🎭 (@AadhiOfficial) April 12, 2024