Kohli-Rohit-Gill: విరాట్ కోహ్లీ 91, రోహిత్ శర్మ 64.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫ్లాప్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Intra Squad Practice Match: వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు ముందు టీమిండియా ఆటగాళ్లు ఇంట్రా-స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. ఇండియా-ఎ, ఇండియా-బి జట్లుగా తలపడిన ఈ మ్యాచ్‌లో పలువురు స్టార్ బ్యాటర్లు సత్తా చాటారు. ముఖ్యంగా కింగ్ విరాట్ కోహ్లీ అజేయ భారీ అర్ధ శతకంతో ఆకట్టుకోగా.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి రాణించారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-ఎ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 88 బంతుల్లో 91 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రవీంద్ర జడేజా వేగంగా పరుగులు చేశాడు. జడ్డు 39 బంతుల్లో 45 పరుగులతో అజేయంగా నిలిచాడు. రుతురాజ్ గైక్వాడ్ 38 బంతుల్లో 42 పరుగులు చేయగా.. కేఎల్ రాహుల్ 29 బంతుల్లో 36 పరుగులతో రాణించాడు. అయితే శుభ్‌మన్ గిల్ మాత్రం 8 బంతుల్లో 7 పరుగులకే పెవిలియన్ చేరాడు.
Also Read
- Afg Vs Nepal: ఏంది సామీ ఆ ఆట.. ఆఫ్ఘనిస్థాన్‌ను చుట్టేసిన నేపాల్ జట్టు.. కుమ్మేసిన పసికూన..
- IND vs WI: రుతురాజ్, నితీష్ ఇన్.. ఆ ఇద్దరు స్టార్లకు నో ఛాన్స్.. వెస్టిండీస్‌తో తొలి వన్డేకు భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
- Joshna Chinappa History: ఏడు ఏషియన్ గేమ్స్.. ఆరు పతకాలు.. 40 ఏళ్ల వయసులోనూ జోష్నా జోరు!
- India vs Japan: చివరి ఓవర్ థ్రిల్లర్.. జపాన్ను భారత్ ‘చీటింగ్’ చేసిందా?
అనంతరం 320 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా-బి 50 ఓవర్లలో 7 వికెట్లకు 309 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 68 బంతుల్లో 72 పరుగులతో ఆకట్టుకోగా.. రోహిత్ శర్మ 59 బంతుల్లో 64 పరుగులు చేశాడు. వీరిద్దరూ జట్టుకు మంచి ఆరంభాన్ని అందించారు. మిడిలార్డర్లో నితీష్ కుమార్ రెడ్డి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 57 బంతుల్లో 61 పరుగులు చేసి జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. నమన్ ధీర్ 28 బంతుల్లో 31 పరుగులు చేశాడు. ధ్రువ్ జురెల్ మాత్రం 5 బంతుల్లో 4 పరుగులకే పరిమితమయ్యాడు. చివరికి ఇండియా-బి 309 పరుగులకే పరిమితమైంది.
వెస్టిండీస్‌తో భారత జట్టు మూడు వన్డేల సిరీస్ సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభం కానుంది. తొలి వన్డే ఆదివారం తిరువనంతపురంలో జరగనుంది. అక్టోబర్ 17 వరకు వెస్టిండీస్‌తో టీమిండియా ఐదు టీ20లు, మూడు వన్డేల్లో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లో ఆటగాళ్ల ప్రదర్శనలు తుది జట్టు ఎంపికకు ముందు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
తాజావార్తలు
-
Kohli-Rohit-Gill: విరాట్ కోహ్లీ 91, రోహిత్ శర్మ 64.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫ్లాప్!
-
Netanyahu: మా దేశంపై దాడి చేస్తే నీ భార్య సమర్థించలేదా? మమ్దానీపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం
-
Ganesh Immersion 2026: గణేశ్ నిమజ్జనంపై హైటెక్ నిఘా.. 10 వేల కెమెరాలు, డ్రోన్లు రెడీ.!
-
ECI: “ఆ వార్త నమ్మొద్దు”.. సీఈసీ జ్ఞానేష్ కుమార్ యూపీ పర్యటన రద్దుపై ఈసీఐ క్లారిటీ..
-
Shehbaz-Rahman: యూఎన్‌లో షెహబాజ్ షరీఫ్-తారిఖ్ రెహమాన్ భేటీ.. భారత్ దృష్టి!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!