Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి ఎక్కడ ఉంటే అక్కడ సందడి వాతావరణం నెలకొంటుంది. ఆయన స్టేజ్ పై మైక్ పట్టుకుంటే కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోని ఎనర్జీతో నవ్వులు పూయిస్తుంటారు. తాజాగా జాసన్ సంజయ్ దర్శకత్వం వహించిన ‘సిగ్మా’ మూవీ తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరు.. టాలీవుడ్ ‘జాతిరత్నాలు’ బ్యూటీ ఫరియా అబ్దుల్లాను ఉద్దేశించి చేసిన ఫన్నీ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తీవ్ర సంచలనంగా మారాయి. వేదిక మీద ఎంతో హుందాగా, ఓ జెంటిల్మెన్లా సైలెంట్‌గా కూర్చుందామని తాను అనుకుంటే.. ఫరియా మాత్రం తనను రెచ్చగొట్టి మరీ డ్యాన్స్ చేయిస్తుందని చిరు సరదాగా వ్యాఖ్యానించారు. “ఫరియా అబ్దుల్లా అంటే నాకు కొంచెం భయం. ఆమధ్య ఓ ఈవెంట్ (ఈనాడు)లో పెద్దరికం నిలుపుకుంటూ రెస్పెక్ట్‌ఫుల్‌గా కూర్చుందాం అనుకున్నా. నేను చస్తే డ్యాన్స్ చేయకూడదు అనుకున్నా. కానీ తను ‘ప్లీజ్ సార్.. ప్లీజ్’ అంటూ ఎంతగా టెంప్ట్ చేసిందంటే.. నేనెంత కంట్రోల్ చేసుకున్నా నా వల్ల కాలేదు. తనలోని ఆ ఎనర్జీ, ఫైర్, వైబ్రేషన్స్ నాకు కూడా షేర్ చేసి నా చేత స్టెప్పులేయించింది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో ఎంత ఉత్సాహపరిచాయో నాకు తెలుసు” అంటూ చిరు ఆనాటి సంఘటనను ఆనందంగా గుర్తుచేసుకున్నారు.
ఇక భవిష్యత్తులో ఎప్పుడైనా ఫరియాతో కలిసి డ్యాన్స్ చేయాలని ఉందని చిరు మనసులో మాట బయటపెట్టారు. వాస్తవానికి తన లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’లో ఆ కాంబినేషన్ మిస్ అయిందని చెబుతూ వేదికపై నవ్వులు పూయించారు. “విశ్వంభరలో ఆ ఛాన్స్ మిస్ అయింది. హైట్ ప్రాబ్లమ్ వల్ల మిస్ అయిందేమో అనుకున్నా. కావాలంటే లావుపాటి బూట్లు, హీల్స్ వేసుకుని నీ హైట్‌కు మ్యాచ్ అయ్యేలా నిలబడతాను, అది పెద్ద సమస్య కాదు. అసలు నా పక్కన వద్దని నువ్వేమైనా చెప్పావా? నన్ను ఎందుకు అవాయిడ్ చేశావు? నా మీద డౌట్ వచ్చిందమ్మా.. నన్నేమైనా తొక్కేయాలని చూస్తావేమో అనుకున్నాను” అంటూ చిరు తనదైన టైమింగ్‌తో పంచులేయడంతో స్టేజ్ దద్దరిల్లిపోయింది. మెగాస్టార్ ఆ రేంజ్లో తనతో జోకులు వేయడంతో ఫరియా అబ్దుల్లా ఉబ్బితబ్బిబ్బైపోయింది. చిరు మాటలకు ఆమె వెంటనే స్పందిస్తూ.. “అయ్యయ్యో.. లేదు సార్ అలాంటి ప్రయత్నం నేను చేయను. మీరు మ్యూజిక్ పెడితే ఇప్పుడే, ఈ స్టేజ్ మీదే మీతో డ్యాన్స్ చేయడానికి నేను రెడీ సార్” అంటూ అంతే ఉత్సాహంగా బదులిచ్చింది. మొత్తానికి కుర్ర డైరెక్టర్ జాసన్ ‘సిగ్మా’ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి, ఫరియా మధ్య జరిగిన ఈ ఫన్నీ సంభాషణ మెగా అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తోంది.
Also Read
- Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
- ‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR - Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
- Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే'.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
- Director Gowri Naidu: ఆ ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది: ‘గరివిడి లక్ష్మి’ డైరెక్టర్
తాజావార్తలు
-
Jammalamadugu-YCP: జమ్మలమడుగులో ఉద్రిక్తత.. ఇందిరమ్మ నామినేషన్‌పై ఉత్కంఠ!
-
IPL 2027 Mini Auction: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముహూర్తం ఖరారు.. ఈసారి వేదిక ఎక్కడో తెలుసా?
-
Naman Dhir: యువరాజ్ సింగ్ 19 ఏళ్ల రికార్డు బ్రేక్.. 6 బంతుల్లోనే నమన్ ధీర్ విధ్వంసం..
-
Tilak Varma: అక్కడ బ్యాటింగ్ చేయడం చాలా కష్టం.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
-
MP Mithun Reddy: మా అభ్యర్థుల నామినేషన్లు తీసుకోవడం లేదు.. హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ ఎంపీ!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!