Afg Vs Nepal: ఏంది సామీ ఆ ఆట.. ఆఫ్ఘనిస్థాన్‌ను చుట్టేసిన నేపాల్ జట్టు.. కుమ్మేసిన పసికూన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియా క్రీడలు 2026 క్రికెట్ పోటీలలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ మధ్య జరిగిన నాల్గవ లీగ్ మ్యాచ్‌లో ఒక అనూహ్య ఫలితం వెలువడింది. ఈ మ్యాచ్‌లో నేపాల్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి ఆఫ్ఘనిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి సంచలనం సృష్టించింది. ఈ టోర్నమెంట్‌కు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు చాలా తక్కువ మంది సీనియర్ ఆటగాళ్లతో కూడిన బలహీనమైన జట్టును పంపడం వారికి శాపంగా మారింది. అయినప్పటికీ, టోర్నమెంట్ సమీకరణాల కారణంగా ఆ జట్టు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకోవడం విశేషం.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే నేపాల్ బౌలర్ల విజృంభణ ముందు ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు తలవంచారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 102 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఫైసల్ షినోజాదా, నజీబుల్లా జాద్రాన్ చెరో 30 పరుగులు చేయడం మినహా, మిగతా బ్యాటర్లందరూ విఫలమయ్యారు. కేవలం 16 పరుగులకే 3 వికెట్లు కోష్టపోయి కష్టాల్లో పడింది. నేపాల్ బౌలర్లలో కుశాల్ భుర్తేల్ 4 వికెట్లు పడగొట్టగా, లలిత్ రాజ్‌బన్షి 3 వికెట్లు దక్కించుకున్నారు.
Also Read
- Shubman Gill: ‘135 పరుగులే కదా.. ఈజీగా ఛేజ్ చేయొచ్చనుకున్నా కానీ’.. భారత్ థ్రిల్లింగ్ విక్టరీపై కెప్టెన్ రియాక్షన్..
- Konaseema: తండ్రి వైసీపీ.. కూతురు టీడీపీ.. ఎన్నికల్లో ఇద్దరూ గెలుపు..
- Cheyutha Pensions: గుడ్‌న్యూస్.. దీపావళి కానుకగా 4.5 లక్షల మందికి కొత్తగా చేయూత పింఛన్లు..
- Tesla Cybertruck: "మూడేళ్లకే కథ ముగిసింది".. టెస్లా 'సైబర్ ట్రక్' ఉత్పత్తిని నిలిపేస్తున్నట్లు మస్క్ ప్రకటన..
అనంతరం 103 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ జట్టు అత్యంత సంయమనంతో ఆడింది. ప్రారంభంలో తడబడినప్పటికీ, 17.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నేపాల్ బ్యాటర్లలో సందీప్ జోరా 34 పరుగులు, రోహిత్ పౌడెల్ 33 పరుగులు చేశారు. కెప్టెన్ దీపేంద్ర సింగ్ ఐరీ 15 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో అరబ్ గుల్ మొమంద్, అబ్దుల్లా అహ్మద్జాయ్, ఫరీదున్ దావ్ద్జాయ్ తలో వికెట్ తీశారు.
ఈ ఓటమి ఎదురైనప్పటికీ, గ్రూప్ దశలో జపాన్‌పై సాధించిన భారీ విజయంతో ఆఫ్ఘనిస్తాన్ మెరుగైన నెట్ రన్ రేట్ కలిగి ఉంది. దీనివల్ల ఆ జట్టు సులభంగా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. గ్రూప్-ఎ లో నేపాల్, జపాన్ మధ్య మరో మ్యాచ్ జరగాల్సి ఉంది. ఒకవేళ నేపాల్ గెలిస్తే ఆ జట్టు గ్రూప్‌లో నంబర్ వన్ స్థానానికి చేరుకుంటుంది. ఏది ఏమైనప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ జట్టు కనీసం రెండో స్థానంతో క్వార్టర్స్‌లో అడుగుపెట్టనుంది. ఈ స్థానంలో ఉంటే తదుపరి దశలో బలమైన భారత్ జట్టుతో తలపడే అవకాశం ఉంది. ఈ అనూహ్య పరిణామం ఆసియా క్రీడల క్రికెట్లో మరింత ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
తాజావార్తలు
-
Kamal Haasan : 23 ఏళ్ళకూ అదే పాట పాడుతున్న కమల్ హాసన్
-
Rakul : రకుల్’ను కాపాడిన రామాయణ
-
Israel Politics: మిడిలీస్ట్‌ను వణికించిన దేశానికి బాస్ ఎవరు? ఇజ్రాయెల్ పీఠంపై వీడని సస్పెన్స్!
-
Megaverse: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, పవన్, రామ్ చరణ్.. నెట్‌ఫ్లిక్స్‌లో మెగా సునామీ!
-
Shubman Gill: ‘135 పరుగులే కదా.. ఈజీగా ఛేజ్ చేయొచ్చనుకున్నా కానీ’.. భారత్ థ్రిల్లింగ్ విక్టరీపై కెప్టెన్ రియాక్షన్..
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!