World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027పై గంభీర్ మాస్టర్ ప్లాన్.. హార్దిక్, బుమ్రా కష్టమే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ 2027 వన్డే ప్రపంచ కప్ కోసం ఇప్పటి నుంచే పకడ్బందీ ప్రణాళికలు రచిస్తున్నారు. టోర్నమెంట్ ప్రారంభానికి సమయం తక్కువగా ఉన్నందున, దక్షిణాఫ్రికా గడ్డపై పూర్తిగా ఫిట్‌గా ఉన్న బలమైన జట్టును బరిలోకి దించాలని భావిస్తున్నారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా వంటి కీలక ఆటగాళ్ల ఫిట్నెస్, వర్క్‌లోడ్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రపంచ కప్ వంటి మెగా టోర్నమెంట్‌కు వెళ్లే ముందు సగం సగం సిద్ధంగా ఉండకూడదని, అక్కడ ఎలాంటి పొరపాట్లకు తావు ఉండకూడదని స్పష్టం చేశారు.
గత ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డే జట్టుకు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా, గత ప్రపంచ కప్‌లోనూ గాయం కారణంగా ఆడలేకపోయారు. పది ఓవర్లు బౌలింగ్ చేస్తూ, ఆరు లేదా ఏడో స్థానంలో బ్యాటింగ్‌లోనూ రాణించగల ఆల్‌రౌండర్లు ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారని గంభీర్ అభిప్రాయపడ్డారు. ఐపీఎల్ తర్వాత హార్దిక్ ఎక్కువ క్రికెట్ ఆడకపోవడంతో, అతనికి తగినంత మ్యాచ్ ప్రాక్టీస్, గేమ్ టైమ్ అవసరమని తెలిపారు. పుదుచ్చేరిలో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ ద్వారా అతను భారత్ ‘ఏ’ జట్టులోకి పునరాగమనం చేస్తాడని ఆశిస్తున్నారు.
Also Read
- Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
- CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
- CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
- AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
మరోవైపు పేస్ అస్త్రం జస్ప్రీత్ బుమ్రా వర్క్‌లోడ్ మేనేజ్మెంట్పై కూడా గంభీర్ స్పష్టతనిచ్చారు. టెస్ట్ క్రికెట్ ఎంత ముఖ్యమో, వన్డేల్లో అతన్ని ఎంత మేర ఉపయోగించుకోవాలనే దానిపై స్పష్టమైన ప్రణాళిక అవసరమని పేర్కొన్నారు. భారత్ ఆడబోయే సుదీర్ఘ సిరీస్‌లు, వివిధ ఫార్మాట్ల షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని ఆటగాళ్ల ఫిట్ నెస్ కాపాడుకోవడం చాలా ముఖ్యమని వెల్లడించారు. టీ20 నుంచి వన్డేలకు మారడం సులభమే అయినప్పటికీ.. టెస్ట్ క్రికెట్ కోసం సిద్ధమయ్యే క్రమంలో బ్యాటర్లకు వైట్ బాల్ క్రికెట్ నుంచి తగిన విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని గంభీర్ తెలిపారు. మొత్తంమీద ఎలాంటి అంచనాలకు, అనుమానాలకు తావులేకుండా పూర్తి ఫిట్నెస్ కలిగిన కోర్ గ్రూప్‌ను ప్రపంచ కప్‌నకు సిద్ధం చేయడమే ప్రస్తుతం తన ప్రధాన లక్ష్యమని తేల్చిచెప్పారు.
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!