యుజ్వేంద్ర చాహల్, భారత క్రికెట్ జట్టులో అద్భుతమైన స్పిన్నర్. ఐపీఎల్‌లో తన మాయాజాలంతో ఆకట్టుకుంటారు. స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ చాలా కాలంగా టీమ్ ఇండియాకు దూరంగా ఉన్నాడు. చాహల్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను ఆగస్టు 2023లో ఆడాడు. తాజా మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ రూ. 18 కోట్ల భారీ ధరకు చాహల్‌ను కొనుగోలు చేసింది. రాజస్థాన్ రాయల్స్ నుంచి పంజాబ్ కింగ్స్‌కు మారడంతో చాహల్ అభిమానుల్లో సరికొత్త ఆసక్తి రేకెత్తించాడు.
Team India: కొత్త ఏడాదిలో టీమిండియా వరుస సిరీస్‌లతో బిజీ కాబోతోంది. శ్రీలంకతో టీ20 సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ముంబై వేదికగా తొలి టీ20 సమరానికి రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో టీమిండియా స్పిన్ బౌలర్ యజ్వేంద్ర చాహల్ శ్రీలంకతో టీ20 సిరీస్‌కు ఫెంటాస్టిక్ ఫైవ్ సిద్ధమని ఓ ఫోటోను ట్వీట్ చేశాడు. ఈ ఫోటోలో చాహల్‌తో పాటు అర్ష్‌దీప్ సింగ్, రుతురాజ్ గైక్వాడ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్ ఉన్నారు. టీమిండియా సీనియర్…
టీమిండియా మాజీ పేసర్, గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిష్ నెహ్రా, రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు చాహల్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీనియర్ కమ్ కోచ్ అయిన నెహ్రా చాహల్‌తో క్లోజ్‌గా ఉంటాడు. అయితే ఐపీఎల్ ఫైనల్ ముగిసిన అనంతరం ఓ పార్టీలో మద్యం సేవించగా.. అనంతరం రోడ్డు మీద ఈ ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. పార్టీ అయిపోయిన తర్వాత చాహల్‌ను నెహ్రా ‘అరే బస్‌లో వెళ్దాం రా’ అంటే…
ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ రికార్డు సృష్టించాడు. ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా అరుదైన ఫీట్ సాధించాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో హార్డిక్ పాండ్యాను ఔట్ చేసి 27వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాకుండా పర్పుల్ క్యాప్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఇమ్రాన్ తాహిర్ 26 వికెట్లు తీయగా.. ఇప్పుడు తాహిర్ రికార్డును బ్రేక్ చేసి తొలి స్థానానికి…
ఐపీఎల్‌లో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు మంచి వినోదాన్ని అందించింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ చాహల్ తన ఐపీఎల్ కెరీర్‌లో తొలిసారి హ్యాట్రిక్ సాధించాడు. ఓవరాల్‌గా మాత్రం ఐపీఎల్ చరిత్రలో చాహల్ నమోదు చేసింది 21వ హ్యాట్రిక్ కావడం విశేషం. చాహల్ కంటే ముందు పలు ఆటగాళ్లు హ్యాట్రిక్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు. అటు రాజస్థాన్ తరఫున హ్యాట్రిక్ నమోదు చేసిన బౌలర్లలో చాహల్ 5వ ఆటగాడు.…
రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు చాహల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. 2013 ఐపీఎల్ సీజన్‌లో ఓ ఆర్‌సీబీ ప్లేయర్ తాగిన మైకంలో తనను 15వ అంతస్తు బాల్కనీలో వేలాడదీశాడని తెలిపాడు. ఏ తప్పిదం జరిగినా తాను అక్కడి నుంచి కిందపడి ప్రాణాలు కోల్పేయేవాడినని సంచలన విషయాన్ని బయటపెట్టాడు. అయితే ఆ ప్లేయర్ పేరును చాహల్ వెల్లడించలేదు. తాజాగా చాహల్ వ్యాఖ్యలపై మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. చాహల్ సదరు ఆటగాడి పేరు…