ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్ ను బీసీసీఐ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే భారత్ లో కరోనా కేసులు అధికంగా నమోదవుతుండటంతో ఈ టోర్నీని యూఏఈకి మార్చింది బీసీసీఐ. అయితే తాజాగా ఈ ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదల అయింది. అక్టోబర్ 23 న ఈ టోర్నీ ప్రారంభం కానుండగా 24న టీం ఇండియా మొదటి మ్యాచ్ పాకిస్థాన్ తో తలపడుతుంది. ఆ తర్వాత 31న న్యూజిలాండ్ తో నవంబర్ 3న ఆఫ్ఘనిస్తాన్ తో పోటీ పడనుంది. ఇక నవంబర్ 5, 8 తేదీలో భారత జట్టు ఎవరితో పోటీ పడనుందో ఇంకా తెలియదు. ఎందుకంటే మొత్తం 12 జట్లు ఈ టోర్నీలో ఆడనుండగా అందులో ఇప్పటివరకు కేవలం 8 జట్లు మాత్రమే అర్హత సాధించాయి. ఇంకా 4 జట్లు ప్రపంచ కప్ లో తమ స్థానం కోసం తలపడుతున్నాయి. కావున జట్ల అర్హత తర్వాత ఆ రెండు రోజుల్లో టీం ఇండియా ఏ ఏ జట్లతో పోటీ పడనుంది అనేది తెలుస్తుంది.