Virender Sehwag Comments On Prithvi Shaw Game: ఐపీఎల్‌లో దొరికిందే అవకాశంగా.. కొందరు యువ క్రికెటర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. కీలకమైన ఇన్నింగ్స్ ఆడుతూ.. తమ జట్లకు బ్యాక్‌బోన్‌గా నిలుస్తున్నారు. కానీ.. పృథ్వీ షా మాత్రం పదే పదే విఫలమవుతున్నాడు. ఒకప్పుడు టీమిండియాకూ ప్రాతినిథ్యం వహించిన ఇతను, ఇప్పుడు జట్టులో చోటు దక్కించుకోవడం కోసం నానాతంటాలు పడుతున్నాడు. ఐపీఎల్ లాంటి అవకాశాన్ని కూడా చేజేతులా పోగొట్టుకుంటున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకూ రెండు మ్యాచ్‌లు ఆడిన అతగాడు.. తొలి మ్యాచ్‌లో 12 పరుగులకి, రెండో మ్యాచ్‌లో ఏడు పరుగులకే ఔటయ్యాడు. అనవసరమైన షాట్ల జోలికి వెళ్లి.. తన వికెట్ కోల్పోయాడు. ఈ నేపథ్యంలోనే టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ అతనిపై ఘాటు విమర్శలు గుప్పించాడు. ఓవైపు శుభ్మన్ గిల్, రుతురాజ్ పరుగుల వరద పారిస్తుంటే.. షా మాత్రం చెత్ల షాట్లతో తప్పులు చేస్తూ, వెనుకబడే ఉన్నాడని చురకలంటించాడు.
Kolkata Knight Riders: కోల్‌కతా పంట పండింది.. శ్రేయస్ స్థానంలో ఆ స్టార్ ప్లేయర్
సెహ్వాగ్ మాట్లాడుతూ.. ‘‘గతంలోనూ ఇలాంటి చెత్త షాట్‌లతోనే పృథ్వీ షా చాలాసార్లు తన వికెట్ సమర్పించుకున్నాడు. అవే తప్పులు పదే పదే చేస్తున్నాడు కానీ, వాటి నుంచి గుణపాఠాలు మాత్రం నేర్చుకోలేకపోతున్నాడు. అదే శుబ్‌మన్ గిల్ విషయానికొస్తే.. ఒకప్పుడు షా కెప్టెన్సీలో అండర్-19 క్రికెట్ ఆడాడు. అలాంటి శుభ్మన్ ఇప్పుడు టీమిండియా తరఫున టెస్టులు, వన్డేలు, టీ20లలో కీలక ప్లేయర్‌గా ఎదిగాడు. ఐపీఎల్‌లోనూ సత్తా చాటుతున్నాడు. శుభ్మన్‌తో పాటు రుతురాజ్ గైక్వాడ్ కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటికే అతగాడు అత్యధిక పరుగులు చేసి, ఆరెంజ్ క్యాప్ గెలిచాడు. ఇలా వీళ్లిద్దరు పరుగుల వర్షం కురిపిస్తూ.. దూకుడు ప్రదర్శిస్తున్నారు. కానీ.. షా మాత్రం ఐపీఎల్‌లో నిలకడైన ప్రదర్శన కనబరచలేకపోతున్నాడు’’ అంటూ పృథ్వీ షా ఆటతీరుని విమర్శించాడు. షాట్స్ ఎంపిక విషయంలో షా జాగ్రత్త వహించాలని.. తన సత్తా చాటుకుంటేనే అతనికి గుర్తింపు ఉంటుందని సూచించాడు. లేకపోతే.. కష్టాలు తప్పవంటూ హెచ్చరించాడు. మరి.. షా ఎలా రాణిస్తాడో చూడాలి.
Hardik Pandya: రాసి పెట్టుకోండి.. రెండేళ్లలో అతడు తురుపుముక్క అవుతాడు