DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!
- గుజరాత్ vs ఢిల్లీ.. హై స్కోరింగ్ థ్రిల్లర్
- వాషింగ్టన్ సుందర్, గిల్ మెరుపులతో భారీ స్కోర్
- కేఎల్ రాహుల్ అద్భుత ఇన్నింగ్స్… సెంచరీకి అడుగు దూరంలో ఆగింది
- చివరి బంతి డ్రామా… ఒక్క పరుగు తేడాతో గుజరాత్ విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన పోరు క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లలో ఒకటిగా నిలిచిపోయింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ హై-స్కోరింగ్ మ్యాచ్‌లో చివరి బంతి వరకు విజయం ఎవరిని వరిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరును సాధించింది. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ తన కెరీర్‌లో అద్భుతమైన ఫామ్‌ను కనబరుస్తూ మొదటి అర్థ సెంచరీతో జట్టుకు భారీ స్కోరును అందించగా, గిల్ తనదైన శైలిలో మెరుపులు మెరిపించారు. 211 పరుగుల క్లిష్టమైన లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆరంభంలోనే నిస్సాంకా వేగంగా పరుగులు రాబట్టి ఆశలు రేకెత్తించాడు.
అయితే ఈ మ్యాచ్‌కు అసలైన ఆకర్షణ కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్. బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడిన రాహుల్, కేవలం 52 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 92 పరుగులు చేసి జట్టును దాదాపు విజయతీరాలకు చేర్చారు. సెంచరీకి అతివలువలో ఉన్న దశలో సిరాజ్ వేసిన అద్భుతమైన బంతికి రాహుల్ పెవిలియన్ చేరడంతో మ్యాచ్ ఒక్కసారిగా గుజరాత్ వైపు మొగ్గు చూపింది. కానీ, డేవిడ్ మిల్లర్ క్రీజులోకి రావడంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది. గాయంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ మిల్లర్ ఆఖరి ఓవర్లలో సిరాజ్ బౌలింగ్‌ను చీల్చిచెండాడు. సిక్సర్లు , ఫోర్ల వర్షం కురిపించడంతో ఢిల్లీ విజయం ఖాయమని అందరూ భావించారు. ఆఖరి ఓవర్‌లో ఢిల్లీ గెలవడానికి 13 పరుగులు అవసరమవ్వగా, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ బాధ్యతలు చేపట్టారు.
Also Read
- Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
- ICC Rankings: మారిన టీ20, వన్డే ఐసీసీ ర్యాంకింగ్ లిస్ట్.. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ స్థానాలు ఇవే..
- Gautam Gambhir: సంజు శాంసన్ విషయంలో తప్పు చేశా.. ఆ రాత్రి నాకు నిద్ర కూడా పట్టలేదు..
- Virat Kohli-Rohit Sharma: బరిలోకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. సెప్టెంబర్ 27 నుంచే సమరం..
ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఆఖరి ఓవర్ మొదటి బంతికే విప్రజ్ నిగమ్ ఫోర్ కొట్టడంతో స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. అయితే రెండో బంతికి నిగమ్ అవుట్ కావడంతో ఉత్కంఠ పరాకాష్టకు చేరింది. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ సింగిల్ తీసి స్ట్రైకింగ్‌ను మిల్లర్‌కు ఇచ్చాడు. నాలుగో బంతిని మిల్లర్ స్టేడియం వెలుపలకు పంపడంతో ఢిల్లీ విజయానికి చివరి రెండు బంతుల్లో కేవలం రెండు పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. ఆ ఐదో బంతిని మిల్లర్ వదిలేయడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఆఖరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన స్థితిలో మిల్లర్ షాట్‌ను మిస్ చేయగా, సింగిల్ తీసే క్రమంలో కుల్దీప్ యాదవ్ రన్ అవుట్ అయ్యాడు. అంపైర్లు ఆ బంతిని ఎత్తు కారణంగా నో-బాల్‌గా పరిగణిస్తారేమోనని కాసేపు ఉత్కంఠ నెలకొన్నప్పటికీ, అది సరైన బంతి అని తేలడంతో గుజరాత్ టైటాన్స్ కేవలం ఒక్క పరుగు తేడాతో అపురూప విజయాన్ని సొంతం చేసుకుంది. రాహుల్ , మిల్లర్ శ్రమ వృథా అయినప్పటికీ, ఈ మ్యాచ్ అభిమానులకు అసలైన క్రికెట్ వినోదాన్ని పంచింది.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!