Monsoon Alert: ఆగస్టులో భారీ వర్షాలు.. బంగాళాఖాతంలో వరస అల్పపీడనాలు..
- ఆగస్టు అంతా భారీ వర్షాలే..
- బంగాళాఖాతంలో వరసగా అల్పపీడనాలు..
- ఎల్‌నినో పరిస్థితులకు చెక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monsoon Alert: భారత్‌లో రుతుపవనాల జోరు కనిపిస్తోంది. ఈ సీజన్లోనే ఆగస్టులో అత్యంత చురుకైన దశగా కనిపిస్తోంది. వాతావరణ అంచనాల ప్రకారం.. బంగాళాఖాతంలో ఆగస్టు చివరి వరకు అల్పపీడన వ్యవస్థలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ సంస్థలు చెబుతున్నాయి. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం-రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్స్ (ECMWF) వర్షపాత అంచనాల ప్రకారం.. రాబోయే 15 రోజుల్లో మధ్య, తూర్పు, ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కరిసే అవకాశం ఉన్నట్లు తేలింది. దేశంలో రుతుపవనా కాలంలో సుదీర్ఘ దశ ఏర్పడే సూచనలు లేకపోవడం మంచి పరిణామంగా కనిపిస్తోంది. ఈ వాతావరణ అంచనాలు రైతుల్లో ఆనందాన్ని నింపుతున్నాయి.
బంగాళాఖాతంలో వరస అల్పపీడనాలు:
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
- Rajnath Singh: యుద్ధం కోరుకోం.. ఎవరైనా కాలు దువ్వితే ఊరుకోం.. రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
బంగాళాఖాతాన్ని రుతుపవనాలకు ‘‘వర్షాల ఫ్యాక్టరీ’’గా పిలుస్తారు. ప్రస్తుతం ఇది సాధారణం కన్నా మరింత చురుకుగా ఉండే అవకాశం కనిపిస్తోంది. వరసగా ఒకదాని తర్వాత ఒకటి అల్పపీడన వ్యవస్థలు ఏర్పడే అవకాశాలు ఏర్పడుతున్నాయి. వీటి వల్ల భారత ఉపఖండం అంతటా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తాజా వాతావరణ అంచనాల ప్రకారం, కొత్త అల్పపీడనాలు తక్కువ వ్యవధిలో ఏర్పడి, భూభాగం వైపు కదిలే అవకాశం ఉంది. వీటి ద్వారా ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురస్తాయి.
ఎల్‌నినో పరిస్థితులకు చెక్..
ఈ ఏడాది పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో వాతావరణ పరిస్థితులు ఏర్పడి, భారత్‌లో రుతుపవనాలను దెబ్బతీస్తాయనే ఆందోళన నెలకొంది. అయితే, బంగాళాఖాతంలో అల్పపీడన వ్యవస్థలు ఏర్పడే అవకాశం ఉండటంతో మాన్సూన్ సర్క్యులేషన్ చురుకుగా కొనసాగే అవకాశం ఉంది. ఇది ఎల్‌నినో తరహా పరిస్థితుల ప్రతికూల ప్రభావాన్ని కొంతవరకు అడ్డుకట్ట వేయవచ్చని అంచనా. ప్రస్తుతం వాతావరణ నమూనాలు సుదీర్ఘ మాన్సూన్ బ్రేక్ ఏర్పడే అవకాశం తక్కువగా ఉన్నట్లు సూచిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే సీజన్ మొత్తంలో వర్షపాతం లోటు మరింత పెరగకుండా ఉండే ఛాన్స్ ఉంది.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!