Venky Atluri: వెంకీ అట్లూరి నెక్ట్స్ మూవీస్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ‘పోలీస్’ కథ ఇంకా రాస్తున్నానంటూ రివీల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venky Atluri: డైరెక్టర్ వెంకీ అట్లూరి ప్రస్తుతం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందన అందుకుంటోంది. ఈ నేపథ్యంలో వెంకీ అట్లూరి తదుపరి ప్రాజెక్టులపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇటీవల విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన నెక్ట్స్ సినిమాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమిళ సార్ట్ హీరో ధనుష్ హీరోగా ఒక సినిమా చేయబోతున్నట్లు తెలిపారు. ఈ సినిమా ‘పోలీస్’ కథ నేపథ్యంలో తెరకెక్కబోతుందని వెల్లడించారు. ప్రస్తుతం ఈ కథపై వర్క్ జరుగుతోందని వెంకీ అట్లూరి తెలిపారు. ఇది పోలీసు స్టోరీ కావడంతో కథను పూర్తి చేయడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. ప్రస్తుతం ఇప్పటికే కమిట్ అయిన ప్రాజెక్టులను పూర్తి చేసిన తర్వాతే తదుపరి సినిమాపై దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం సిద్దూ జొన్నలగడ్డ హీరోగా ఒక వెబ్ సిరీస్ తీస్తున్నట్లు తెలిపారు. ఈ వెబ్ సిరీస్ అయిపోయిన తర్వాత న్యాచురల్ స్టార్ నాని గారితో కూడా ఒక సినిమా చేయాల్సి ఉందని, ఆ కథపై కూడా వర్క్ చేయాలన్నారు. ముందు అయితే పోలీసు స్టోరీ పూర్తి అయిన తర్వాతనే ఈ కథపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు. త్రివ్రికమ్ శ్రీనివాస్ గారితో తన సంబంధం గురుశిష్యుల బంధం అని చెప్పారు. ఇక నిర్మాతగా తనకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తన సినిమా నిర్మాతలు ఎప్పుడూ తనకు అండగా నిలుస్తారని వెంకీ అట్లూరి చెప్పారు. కొన్నిసార్లు బడ్జెట్ విషయంలో తాను కొంచెం హద్దులు దాటినా నిర్మాతలు తనను సపోర్ట్ చేస్తారని తెలిపారు. ప్రస్తుతం రిలీజ్ అయిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు పాజిటీవ్ స్పందన వస్తున్న నేపథ్యంలో వెంకీ అట్లూరి తదుపరి ప్రాజెక్టులపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ మరింత ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా ఆయన దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కబోతున్న ‘పోలీస్’ కథ ఎప్పుడు పట్టాలెక్కుతుందనే దానిపై ధనుష్ ఫ్యాన్స్‌తో పాటు సినీ అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది.
Also Read
- AP Theatres Crisis: టికెట్ ధరలు పెంచొద్దు.. ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం కీలక డిమాండ్లు..
- Krishnam Bhaje: మార్కండేయుడిగా బ్రహ్మాజీ.. 'కృష్ణంభజే' ఫస్ట్ లుక్ అవుట్!
- Tollywood : హాలీవుడ్ నుండి విలన్స్‌ను దిగుమతి చేస్తోన్న టాలీవుడ్
- Hanuman Ansh: అప్పుడు సహాయం చేయలేదు.. ఇప్పుడేమో పొగుడుతున్నారు.. బాలీవుడ్‌పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
-
OTR: వివాదాలకు కేరాఫ్‌గా బోనబోయిన శ్రీనివాస్..
-
Gut Health: జీర్ణక్రియ మెరుగుపడాలంటే..? రోజువారీ ఆహారంలో ఈ ఐదు చేర్చండి
-
OTR: యాక్టివ్ మోడ్‌లోకి షకీల్.. కవిత ఎఫెక్ట్, కేటిఆర్ వార్నింగ్ కారణమా ?
-
OTR: కొండా సురేఖ బీజేపీలో చేరుతుందా ?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!