Football Club: సంచలనం.. రూ.100కే ఫుట్‌బాల్ క్లబ్ అమ్మకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాటా స్టీల్ యాజమాన్యంలోని జమ్షెడ్పూర్ ఎఫ్‌సీ స్థానాన్ని ప్రముఖ గోవా క్లబ్ చర్చిల్ బ్రదర్స్ భర్తీ చేసేందుకు బాటలు సిద్ధమయ్యాయి. జమ్షెడ్పూర్ ఫుట్‌బాల్ అండ్ స్పోర్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (JFSPL) లోని తన పూర్తి వాటాలను కేవలం రూ. 100 టోకెన్ ధరకు చర్చిల్ బ్రదర్స్‌కు బదిలీ చేసేందుకు టాటా స్టీల్ డైరెక్టర్ల కమిటీ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో రెండు యాజమాన్యాల మధ్య ఒప్పందం కూడా కుదిరింది. ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (AIFF) నుంచి అనుమతులు రాగానే రాబోయే 15 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. ఈ మార్పు ద్వారా చర్చిల్ బ్రదర్స్ మళ్లీ భారత అగ్రశ్రేణి ఫుట్‌బాల్ లీగ్ (ISL) లోకి అడుగుపెట్టే అవకాశం లభించింది.
ఈ డీల్‌లో భాగంగా జమ్షెడ్పూర్ ఎఫ్సీకి ఉన్న ఐఎస్ఎల్ స్పోర్టింగ్ లైసెన్స్‌తో పాటు, 12 మంది ఆటగాళ్లు, ఇద్దరు కోచ్‌ల కాంట్రాక్టులు కూడా చర్చిల్ బ్రదర్స్‌కు బదిలీ కానున్నాయి. టాటా స్టీల్ క్లబ్ స్థాయి ఫుట్‌బాల్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకోవడమే ఈ హఠాత్ పరిణామానికి ప్రధాన కారణం. ఆర్థిక కారణాల కంటే.. గ్రాస్రూట్స్, యువజన ఫుట్‌బాల్ అభివృద్ధిపై దృష్టి సారించడమే తమ లక్ష్యమని కంపెనీ స్పష్టం చేసింది. దశాబ్ద కాలంగా వృత్తిపరమైన ఫుట్‌బాల్‌లో ఉన్న టాటా స్టీల్, ఇకపై టాటా ఫుట్‌బాల్ అకాడమీ (TFA) ద్వారా కొత్త ప్రతిభను వెలికితీయడంపైనే ఎక్కువ దృష్టి పెట్టనుంది. ఎఐఎఫ్ఎఫ్ ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరినప్పటికీ టాటా స్టీల్ ముందుకు సాగింది.
Also Read
- ECI SIR Meeting: ఎన్నికల సంఘం కీలక భేటీ.. SIR గడువులపై కీలక నిర్ణయాలు
- Bank Strike: బ్యాంక్‌ల సమ్మె వేళ గుడ్ న్యూస్.. వాటికి ఛార్జీలు రద్దు.. SBI ఖాతాదారులకు భారీ ఊరట
- Ahmedabad Plane Crash: తుది నివేదికపై పైలట్ల సంఘం తీవ్ర అభ్యంతరం.. కేంద్రమంత్రికి కీలక లేఖ
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
మరోవైపు చర్చిల్ బ్రదర్స్‌కు ఇది చాలా కాలం తర్వాత లభించిన గొప్ప అవకాశం. గతంలో 2024-25 ఐ-లీగ్‌లో విజేతగా నిలిచినప్పటికీ, పాయింట్ల వివాదంపై ఇంటర్ కాశీ క్లబ్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS) ను ఆశ్రయించడంతో చర్చిల్ టైటిల్‌ను, ప్రమోషన్‌ను కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఐఎస్ఎల్లోకి ప్రవేశించడానికి చర్చిల్ చేసిన ప్రయత్నాలు విఫలమై, ఐ-లీగ్ 2కి దిగజారాల్సి వచ్చింది. ఇప్పుడు జమ్షెడ్పూర్ ఎఫ్‌సీ లైసెన్స్‌ను కొనుగోలు చేయడం ద్వారా చర్చిల్ బ్రదర్స్ మళ్లీ ఐఎస్ఎల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతోంది.
తాజావార్తలు
-
ECI SIR Meeting: ఎన్నికల సంఘం కీలక భేటీ.. SIR గడువులపై కీలక నిర్ణయాలు
-
Bank Strike: బ్యాంక్‌ల సమ్మె వేళ గుడ్ న్యూస్.. వాటికి ఛార్జీలు రద్దు.. SBI ఖాతాదారులకు భారీ ఊరట
-
The Paradise: ‘పెద్ది’ రిజల్ట్ చూశాక కూడా ‘ది పారడైజ్’ పాఠాలు నేర్వలేదా?
-
Ahmedabad Plane Crash: తుది నివేదికపై పైలట్ల సంఘం తీవ్ర అభ్యంతరం.. కేంద్రమంత్రికి కీలక లేఖ
-
Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?