భారత్ – పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటేనే అభిమానులకు ఎంత ఆసక్తి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ రోజు ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. ఇప్పటివరకు ఈ రెండు జట్లు పొట్టి ప్రపంచ కప్ లో మొత్తం 5 సార్లు ఐదుసార్లు తలపడగా అందులో మన ఇండియానే మొత్తం విజయం సాధించింది. దాంతో ఈరోజు జరుగుతున్న మ్యాచ్ లో విజయం సాధిస్తే పాకిస్తాన్ జట్టుకు బ్లాంక్ చెక్ ఇస్తానని ఓ ప్రముఖ వ్యాపార వేత్త చెప్పినట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమేష్ రజానే స్వయంగా ప్రకటించాడు. ఇది ఇలా ఉంటె ఈ రోజు పాకిస్థాన్ కు చెందిన ఓ ఫుడ్ డెలివరీ యాప్ మరో ప్రత్యేకమైన ఆఫర్ అభిమానులకు ఇచ్చింది. అది ఏంటంటే… ఇండియా పై పాకిస్తాన్ జట్టు విజయం సాధిస్తే ఈరోజు తమ యాప్లో ఆర్డర్ చేసిన అందరికీ రిఫండ్ ఇస్తానని తెలిపింది. అయితే ఈ రిఫండ్ ఆఫర్ ఈరోజు రాత్రి 9 గంటల లోపు ఆర్డర్ చేసిన వారికి మాత్రమే వర్తిస్తుందని కూడా స్పష్టం చేసింది.